Hebrews 12
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ
"ప్రతి భారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు"
"మీరు అలసట పకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. క్రమశిక్షణ యొక్క ఉద్దేశ్యము"
మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింప లేదు.
"మరియు- నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము,"
"ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి."
శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
"కుమాళ్లయిన వారందరు శిక్షలో పాలు పొందు చున్నారు, మీరు పొందని యెడల దుర్బీజులే గాని కుమారులు కారు."
మరియు శరీర సంబంధులైన తండ్రీలు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రదుకవలెను గదా?
వారు కొన్ని దినముల మట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు.
మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
కాబట్టి సలిన చేతులను సలిన మోకాళ్లను బలపరచుడి.
మరియు కుంటి కాలు బెణకక బాగుపు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి. మెలుకువగా నుండవలెనని హెచ్చరికలు
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడు.
"మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవర పరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,"
ఒక పూట కూటి కొరకు తన జ్యేషసత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి.
"ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి, కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు. ఇహలోక సీడియోనుకును పరలోక సీయోనుకును గల తారతమ్యము"
"స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢంధకారమునకును, తుఫానుకును,"
"బూర ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండ లేదు."
"ఒక జంతువైనను ఆ కొండను తాకిన యెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి."
"మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున, మోషే - నేను మిక్కిలి భయపడి వణకుచున్నాననెను."
"ఇప్పుడైతే సీయోనను కొండకును, జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును,"
"పరలోక మందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును,"
"క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును, హేబెలు కంటె మరి శ్రేష్టముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును, మీరు వచ్చియున్నారు."
"మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధిచెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనక పోయిన యెడల, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనక పోవుట మరి నిశ్చయము గదా?"
"అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని, యిప్పుడు-నే నింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింప చేతును అని మాట యిచ్చియున్నాడు."
ఇంకొక సారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసి వేయబడునని అర్థమిచ్చుచున్నది.
"అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియందము."
"ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు."