:

Hebrews 6

1

"కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు, దేవునియందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక,"

2

"క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణుల మగుటకు సాగిపోదము."

3

దేవుడు సెలవిచ్చిన యెడల మన మాలాగు చేయుదము.

4

"ఒకసారి వెలిగింపబడి, పరలోక సంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై,"

5

"దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు."

6

గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము.

7

"ఎట్లనగా భూమి తన మీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును."

8

అయితే ముండ్లతుప్పలును గచ్చ తీగెలును దాని మీద పెరిగిన యెడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగిన దగును. తుదకది కాల్చివేయబడును.

9

"అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింత కంటె మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాము."

10

"మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థు కాడు."

11

"మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్ధానములను స్వతంత్రించు కొనువారిని పోలి నడుచుకొనునట్లుగా."

12

మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆసక్తిని తుదముట్టుకు కనుపరచెవలెనని అపేక్షించుచున్నాము.

13

దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తన కంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక

14

తన తోడు అని ప్రమాణము చేసి- నిశ్చయముగా నేను నిన్ను అశీర్వదింతును - నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను.

15

ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను.

16

మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే.

17

"ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచ వలెనని ఉద్దేశించినవాడై,"

18

"తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి, మన యెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను."

19

"ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది."

20

నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మన కంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను.

Link: