:

Luke 1

1

"ఘనత వహించిన థెయొఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి"

2

వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు

3

గనుక నీకు ఉపదేశింప బడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు

4

వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని.

5

"యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలో నున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె, అమె పేరు ఎలీసబెతు."

6

"వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడచుకొనుచు, దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి."

7

ఎలీసబెతు గొడ్రలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహుకాలము గచిన వృద్ధులైరి.

8

జెకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని యెదుట యాజక ధర్మము జరిగించు చుండగా

9

"యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి, ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను."

10

"ధూప సమయమందు ప్రజల సమూహమంతయు బయట ప్రార్థన చేయుచుండగా,"

11

"ప్రభువుదూత ధూపడవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా,"

12

జెకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయెను.

13

"అప్పుడు దూత అతనితో - ''జెకర్యా, భయపడకుము; నీ ప్రార్థన వినబడినది; నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును; అతనికి యోహాను అని పేరు పెట్టుదువు."

14

అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక

15

"తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడై,"

16

ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.

17

"మరియు అతడు తండ్రీల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్త పడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహదానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు'' అనెను."

18

జెకర్యా - ''ఇది నాకెలాగు తెలియును ? నేను ముసలివాడను. నా భార్యయు - బహుకాలము గచినది'' అని ఆ దూతతో చెప్పగా

19

దూత - ''నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును. ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.

20

మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుదినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువు'' అని అతనితో చెప్పెను.

21

ప్రజలు జెకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయము నందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.

22

"అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడ లేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై యుండెను."

23

అతడు సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్ళెను.

24

ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై - మనుష్యులలో నాకున్న అవమానమును తీసివేయుటకు

25

నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగు చేసెననుకొని ఐదునెలలు యితరుల కంటబడకుండ నుండెను.

26

ఆరవనెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో

27

దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.

28

"ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి - ''దయాప్రాప్తురాలా, నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడు'' అని చెప్పెను."

29

"ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచన మేమిటో అని ఆలోచించు కొనుచుండగా, దూత -"

30

"''మరియా, భయపడకుము; దేవుని వలన నీవు కృప పొందితివి"

31

ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు.

32

"ఆయన గొప్పవాడై, సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును."

33

ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు యేలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును'' అని ఆమెతో చెప్పెను

34

"అందుకు మరియ - ''నేను పురుషుని ఎరుగని దాననే, ఇదెలాగు జరుగునని'' దూతతో అనగా,"

35

దూత - పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.

36

మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన వృద్ధాప్యమున ఒక కుమారుని గర్భమున ధరించియున్నది. గొడ్రలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము.

37

దేవుడు చెప్పిన ఏ మాటయైనను నిరర్థకము కానేరదు'' అని ఆమెతో చెప్పెను.

38

అందుకు మరియ - ''ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక'' అనెను. అంతట ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను.

39

ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలో నున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి

40

జెకర్యా యింటిలో ప్రవేశించి ఎలీసబెతుకు వందనము చేసెను.

41

"ఎలీసబెతు మరియ యొక్క వందన వచనము వినగానే, ఆమె గర్భములో నున్న శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై, బిగ్గరగా యిట్లనెను-"

42

"స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును"

43

నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను?

44

"ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే, నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను."

45

ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు'' అనెను.

46

"అప్పుడు మరియ యిట్లనెను- ''నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది,"

47

ఆయన తన దాసురాలి దీనస్తితిని కటాక్షించెను

48

నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను.

49

సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరములవారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము

50

ఆయనకు భయపడువారి మీద ఆయన కనికరము తరతరములకుండును.

51

"ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై, గర్విష్టులను చెదరగొట్టెను"

52

సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను

53

"ఆకలి గొనిన వారిని మంచి పదార్ధములతో సంతృప్తిపరచి, ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను."

54

అబ్రాహామునకును అతని సంతానములకును యుగాంతము వరకు

55

తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.''

56

అంతట మరియ ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడ నుండి పిమ్మట తన యింటికి తిరిగి వెళ్ళెను.

57

ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.

58

. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషపడిరి.

59

"ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని వానికి పేరు పెట్టబోవుచుండగా,"

60

తల్లి- ''అలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెను'' అని చెప్పెను.

61

"అందుకు వారు - ''నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడు'' అని ఆమెతో చెప్పి,"

62

వానికి ఏ పేరుపెట్ట గోరుచున్నావని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి.

63

అతడు వ్రాత పలకతెమ్మని - వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.

64

"వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను."

65

"అందును బట్టి వారి చుట్టుపక్కల కాపురమున్న వారి కందరికి భయము కలిగెను, ఆ సంగతులన్నియు యూదయ కొండసీమల యందంతట ప్రచురమాయెను."

66

ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరును - ఈ బిడ్డ ఏలాటి వాడగునో అని వాటిని మనస్సులో నుంచుకొనిరి.

67

మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను -

68

''ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక; ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగుజేసెను.

69

"తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా"

70

మన శత్రువుల నుండియు మనలను ద్వేషించువారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించిన రీతిగా

71

"మన శత్రువుల నుండియు, మనలను ద్వేషించువారందరి చేతి నుండియు తప్పించి, రక్షణ కలుగజేసెను."

72

ఆయన మన పితరులను కరుణించుటకును

73

తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును

74

"మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై,"

75

"ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను, అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను."

76

"మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు."

77

ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడతువు

78

"మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు, మన పాదములను సమాధానమార్గములోనికి నడిపించునట్లు"

79

చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమను గ్రహించెను.

80

"శిశువు ఎదిగి, ఆత్మ యందు బలము పొంది, ఇశ్రాయేలు నకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను."

Link: