Luke 19
ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి
"దాని గుండ పోవుచుండెను. సుంకపు గుత్తదారుడును, ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గలవాడు ఒకడు"
"యేసు ఎవరో యని చూడగోరెను గాని, పొట్టివాడైనందున జనులు గుంపు గూడి యుండుట వలన చూడలేకపోయెను."
అప్పుడు యేసు ఆ త్రోవను రానైయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను.
"యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి-, ''జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసియున్నది'' అని అతనితో చెప్పగా,"
అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.
అందరు అది చూచి - ఈయన పాపియైన మనుష్యుని యొద్ద బస చేయవెళ్ళెనని చాల సణుగుకొనిరి.
"జక్కయ్య నిలువబడి - ''ఇదిగో ప్రభువా, నా ఆస్థిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన యెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతును'' అని ప్రభువుతో చెప్పెను."
"అందుకు యేసు- ''ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది."
నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను'' అని అతనితో చెప్పెను.
"వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున యుండుట వలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా,"
"''రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై,"
తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మీనాలనిచ్చి నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను.
అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి ఇతను మమ్మునేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయభారము పంపిరి.
అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను.
"మొదటివాడయన ఎదుటకు వచ్చి - అయ్యా, నీ మీనా వలన పది మీనాలు లభించినట్లు చెప్పగా,"
"అతడు - ''భళా మంచి దాసుడ, నీవు ఈ కొంచెములో నమ్మకముగా నుంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుము'' అని వానితో చెప్పెను."
"అంతట రెండవవాడు వచ్చి - ''అయ్యా, నీ మీనా వలన ఐదు మీనాలు లభించెను'' అనగా,"
అతడు - ''నీవును ఐదు పట్టణముల మీద నుండుమ''ని అతనితో చెప్పెను.
"అంతట మరియొకడు వచ్చి - ''అయ్యా, ఇదిగో నీ మీనా,"
నీవు పెట్టనిదానిని ఎత్తుకొను వాడవును విత్తని దానిని కోయువాడవు నైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టియుంచితినని చెప్పెను.
"అందుకతడు - ''చెడ్ఢ దాసుడ, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తనిదానిని కోయువాడనైన కఠినుడనని నీకు తెలిసియుండగా,"
"నీ వెందుకు నా సొమ్ము షాహుకారుల యొద్ద నుంచలేదు ? అట్లు చేసియుండిన యెడల నేను వచ్చి వడ్డి తో దానిని తీసుకొందునే అని వానితో చెప్పి,"
వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి పది మీనాలు గలవానికియ్యుడి'' అని దగ్గర నిలచియున్న వారితో చెప్పెను.
"వారు - అయ్యా, వానికి పది మీనాలు కలవే అనిరి."
"అందుకతడు - ''కలిగిన ప్రతివానికిని ఇయ్యబడును, లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును'' అని మీతో చెప్పుచున్నాను."
మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇచ్చటికి తీసుకొని వచ్చి నా యెదుట సంహరించుడని చెప్పెను.''
యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందుకు సాగిపోయెను.
ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే బేతనియ అను గ్రామముల దగ్గరకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి-
''మీరు యెదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొని రండి.
"ఎవరైనను ఎందుకు మీరు దీని విప్పుచున్నారని మిమ్మునడిగిన యెడల, ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడి'' అని చెప్పి వారిని పంపెను."
"పంపబడినవారు వెళ్ళి, ఆయన తమతో చెప్పినట్లే కనుగొని"
"ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి."
అందుకు వారు- ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి.
"తరువాత వారు దానిని యేసునొద్దకు తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి, యేసును దాని మీద ఎక్కించి"
ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడగునా పరిచిరి.
"ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నపుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు,"
"ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు నుండును గాక అని తాము చూచిన అద్బుతము లన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి,"
"ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు - ''బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమ''ని చెప్పగా,"
ఆయన వారిని చూచి - ''మీరు ఊరకుండిన యెడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను'' అనెను.
"ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి,"
''నీవును - ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనిన యెడల నీ కెంతో మేలు; కాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు జేయబడియున్నవి.
"ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక, నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి, ముట్టి వేసి, అన్ని ప్రక్కల నుండి నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి"
నీలో రాతి మీద రాయి నిలిచియుండనియ్యని దినములు వచ్చును'' అని చెప్పెను.
ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో - ''నా మందిరము ప్రార్థన మందిరమని వ్రాయబడియున్నది.
అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి'' అని చెప్పి వారిని వెళ్ళగొట్ట నారంభించెను.
"ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనము చేయ చుచుండిరి, గాని"
ప్రజలందరు ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమిచేయవలెనో వారికి తోచలేదు.