:

Mark 15

1

"ఉదయము కాగానే ప్రధాన యాజకులును పెద్దలును శాస్త్రులను మహాసభ వారందరును కలిసి, ఆలోచనచేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి"

2

పిలాతు - యూదుల రాజువు నీవేనా ? అని ఆయన నడుగగా - ఆయన ''నీవన్నట్టే'' అని అతనితో చెప్పెను.

3

"ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా,"

4

పిలాతు ఆయనను చూచి మరల - నీవు ఉత్తరమేమియు చెప్పవా ? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను.

5

అయినను యేసు మరి ఏ ఉత్తరమును చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను.

6

ఆ పండుగలో వారు కోరిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు.

7

అధికారుల నెదిరించి కలహములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియున్న బరబ్బ అను ఒకడుండెను.

8

"జనులు గుంపుగా కూడివచ్చి అతడు అది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా,"

9

ప్రధాన యాజకులు అసూయ చేత యేసుని అప్పగించిరని పిలాతు తెలిసికొని -

10

నేను యూదులరాజును మీకు విడుదల జేయ గోరుచున్నారా? అని అడిగెను.

11

అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగు కొనునట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి.

12

అందుకు పిలాతు ఆలాగైతే యూదుల రాజని మీరు చెప్పువానిని నేనేమి చేయుదునని మరల వారి నడిగెను.

13

వారు - వానిని సిలువ వేయుమని మరల కేకలు వేసిరి.

14

అందుకు పిలాతు - ఎందుకు ? అతడే చెడు కార్యము చేసెనని వారి నడుగగా వారు- వానిని సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి.

15

"పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై, వారికి బరబ్బను విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను."

16

"అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరము లోపలికి తీసికొని పోయి సైనికులందరిని సమకూర్చుకొనిన తరువాత,"

17

ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తలమీద పెట్టి-

18

"యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి."

19

మరియు రెల్లుతో ఆయన తలమీద కొట్టి ఆయనమీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి.

20

"వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఊదా రంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువ వేయుటకు తీసుకొనిపోయిరి."

21

"కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి."

22

అతడు అలెక్సందునకును రూపునకును తండ్రి. వారు గొల్గతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాలస్థలమని అర్థము.

23

అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయన కిచ్చిరి గాని ఆయన దాని పుచ్చుకొన లేదు.

24

"వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి, వాటిని పంచుకొనిరి."

25

ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను

26

మరియు యూదుల రాజైన యేసు అని అతని మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి.

27

మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను

28

ఆయనతో కూడ సిలువ వేసిరి.

29

"అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తల లూచుచు - ఆహా, దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ,"

30

సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొను మని చెప్పి ఆయనను దూషించిరి.

31

"అట్లు శాస్త్రులును ప్రధాన యాజకులును అపహాస్యము చేయుచు - వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించు కొనలేడు."

32

ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో నొకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడ సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి.

33

మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.

34

"మూడు గంటలకు యేసు ''ఎలోయీ,ఎలోయీ, లామా సబక్తానీ'' అని బిగ్గరగా కేక వేసెను; ఆ మాటలకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము"

35

దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని - అదిగో ఏలీయాను పిలుచు చున్నాడనిరి

36

ఒకడు పరుగెత్తుకొని పోయి ఒక స్పంజీ చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింపవచ్చునేమో చూతమనెను.

37

అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను.

38

అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను.

39

ఆయనకెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి - నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.

40

"వారిలో మగ్దలేనే మరియయు చిన్న యాకోబు, యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు నుండిరి."

41

ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులును వారిలో నుండిరి.

42

ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము

43

"గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి, పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును (తనకిమ్మని) అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు."

44

పిలాతు ఆయన ఇంత లోనె చనిపోయెనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి - ఆయన ఇంతలోనే చనిపోయెనా? అని అతని నడిగెను.

45

"శతాధిపతి వలన సంగతి తెలుసుకొని, యోసేపునకు ఆ శవమును అప్పగించెను."

46

అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.

47

మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన ఉంచబడిన చోట చూసిరి.

Link: