:

Matthew 2

1

"రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి-"

2

యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు ? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి.

3

హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితోకూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.

4

కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరిని సమకూర్చి - క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.

5

"అందుకు వారు - యూదయ బేత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు ''బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను, నా కొరకు, ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును'' (మీకా5:2) అని ప్రవక్త ద్వారా వ్రాయబడియున్నది అనిరి."

6

"అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,"

7

ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని –

8

"మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను."

9

"వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను."

10

"వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి,"

11

"తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి."

12

తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి.

13

"వారు వెళ్ళిన తరువాత ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై - ''హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట బెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుము'' అని అతనితో చెప్పెను."

14

"అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని,"

15

''నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని'' (హోషేయ 11:1) అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను.

16

"ఆ జ్ఞానులు తనను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానుల వలన వివరముగా తెలిసికొనిన కాలమును బట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను."

17

"అందువలన - ''రామాలో అంగలార్పును, మహరోదన ధ్వనియు వినబడుచున్నవి:"

18

రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేక పోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది'' (యిర్మీయా 31:15) అని ప్రవక్తయైన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.

19

"హేరోదు చనిపోయిన తరువాత, ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్ష మై"

20

నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము;

21

"శిశువు ప్రాణము తీయచూచుచుండినవారు చనిపోయిరి అని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను."

22

"అయితే ఆర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలు చున్నాడని విని,"

23

"అక్కడికి వెళ్ళ వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ నివాసముండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు అలాగు జరిగెను."

Link: