Philippians 3
"నా సహోదరులారా, అన్నిటికన్నా ముఖ్యముగా ప్రభువునందు ఆనందించుడి."
అదే సంగతులను వ్రాయుట నాకు కష్టమైనది కాదు కాని మీకు అది క్షేమకరము.
"కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా వుండుడి. ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా నుండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, క్రీస్తు యేసు నందు అతిశయ పడుచున్న మనమే సున్నతి ఆచరించువారము."
కావలయునంటే నేను శరీరమునాస్పదము చేసికొన వచ్చును మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచిన యెడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును.
"ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై,"
"ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై యుంటిని."
అయినను ఏవేవి నాకు లాభకరముగా ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.
నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.
"క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తు నందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,"
"ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవము కలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును,ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును."
సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.
"ఇదివరకే నేను గెలిచితినని యైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తుయేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను."
"సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. ఆయితే ఒకటి చేయుచున్నాను- వెనుక ఉన్నవి మరచి, వాటిని లక్ష్యపెట్టక ముందున్న వాటి కొరకై వేగిర పడుచు,"
"క్రీస్తుయేసు నందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను."
కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేని గూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగి యున్నయెడల అదియు దేవుడు మీకు బయలు పరచును.
అయినను ఇప్పటివరకు మనకు లభించినదాని బట్టియే క్రమముగా నడచుకొందము.
"సహోదరులారా, మీరు నన్ను పోలి నడచుకొనుడి; మేము మీకు మాదిరియై యున్న ప్రకారము నడుచుకొనువారిని గురి పెట్టి చూడుడి."
అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను.
"నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపవలసిన విషయములకై వారు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు."
మన పౌరస్థితి పరలోకమందున్నది; అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని యున్నాము.
సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును.