:

Psalms 110

1

ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.

2

యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.

3

యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ ¸°వనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులైమంచు వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు

4

"మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు."

5

ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును.

6

అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాలదేశముమీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.

7

మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.

Link: