:

Psalms 113

1

"యెహోవాను స్తుతించుడి యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి."

2

ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక.

3

సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది.

4

యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి యున్నది

5

ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహో వాను పోలియున్నవాడెవడు?

6

ఆయన భూమ్యాకాశములను వంగిచూడననుగ్రహించు చున్నాడు.

7

ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై

8

ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు

9

ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.

Link: