కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.
12
లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.
13
వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?
14
దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.
15
ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.
16
భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి?
17
దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు.
18
నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.
19
కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది.
20
నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు.
21
ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను
22
"దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును"
23
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచు చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.