:

Psalms 95

1

రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయు... దము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయు దము

2

కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.

3

యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు

4

భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతశిఖరములు ఆయనవే.

5

సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను.

6

ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.

7

రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.

8

అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి.

9

అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి

10

నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని.

11

కావున నేను కోపించివీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని.

Link: