:

Revelation 13

1

మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద పది కిరీటములును దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.

2

"నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను."

3

దాని తలలలో ఒక దానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మాని పోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్లుచు ఆశ్చర్యపు చుండిరి.

4

ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు- ఈ మృగముతో సాటియెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి.

5

డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు నలువది రెండు నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను.

6

"గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును, ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను."

7

మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాటలాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికియ్యబడెను.

8

"భూ నివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు."

9

ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక;

10

"ఎవడైనను చెరపట్ట వలెనని ఉన్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపినయెడల వాడు ఖడ్గము చేత చంపబడ వలెను, ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును."

11

మరియు భూమిలో నుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱెపిల్ల కొమ్మువంటి రెండు కొమ్ములు దానికుండెను; అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను;

12

అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బ తగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది.

13

అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల యెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.

14

"కత్తి దెబ్బతినియు బ్రదికిన ఈ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది."

15

"మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను."

16

"కాగా కొద్దివారు గాని గొప్పవారుగాని ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని, అందరును తమ కుడిచేతి మీదనైనను తమ నొసటియందైనను ముద్ర వేయించు కొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది."

17

బుద్ధిగల వాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము;

18

"అది యొక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య ఆరువందల ఆరువదియారు; ఇందులో జ్ఞానము కలదు."

Link: