Romans 11
"ఆలాగైన యెడల నేనడుగున దేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేను కూడ ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టిన వాడను."
తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా ?
"ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి యున్నాను, నా ప్రాణము తీయచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు."
అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది ? బయలుకు మోకాళ్ళానని ఏడువేల మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొనియున్నాను.
"అలాగుననే అప్పటికాలమందు సయితము, కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది"
అది కృప చేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని యెడల కృప ఇకను కృప కాకపోవును.
"ఆలాగైన యేమగును ? ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కినవారు కఠిన చిత్తులైరి."
"ఇందు విషయమై- నేటి వరకు దేవుడు వారికి నిద్ర మత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది."
"మరియు - వారి భోజనము వారికి ఉరిగాను, బోను గాను ఆటంకము గాను వారి క్రియలకు ప్రతి ఫలముగాను యుండును గాక."
వారు చూడకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మును గాక. వారి వీపును ఎల్లప్పుడును వంగి పోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు.
"కాబట్టి నేనడుగనదేమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లనరాదు."
"వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన యెడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును!"
అన్యజనులగు మీతో నేను మాటలాడుచున్నాను.
"నేను అన్యజనులకు అపొస్తలుడనై యున్నాను గనుక, ఏ విధముననైనను నా రక్తసంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను."
"వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయినయెడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా?"
ముద్దలో మొదటి పడి డికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.
"అయితే కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి, అడవి ఒలీవ కొమ్మవైయున్న నీవు, వాటి మధ్యన అంటుకట్టబడి, ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలసి పాలు పొందినయెడల, ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము."
"నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు."
అందుకు - నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు.
"మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచి వేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి యున్నావు; గర్వింపక భయపడుము."
దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టు.
"కాబట్టి దేవుని అనుగ్రహమును, కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ పాత్రుడవై నిలిచియున్నయెడల, నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము; అట్లు నిలువనియెడల నీవును నరికి వేయబడుదువు."
వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన యెడల అంటుకట్ట బడుదురు; దేవుడు వారిని మరల అంటు కట్టుటకు శక్తి గలవాడు.
"ఎట్లనగా, నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి, స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటు కట్టబడిన యెడల, స్వాభావికమైన కొమ్మలగు వారు, మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా ?"
"సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను."
వారు ప్రవేశించునప్పుడు - విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.
"సువార్త విషయమైతే, వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై యున్నారు."
"ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములలోను, పిలుపు విషయములోను పశ్చాత్తాపప డు."
"మీరు గత కాలమందు దేవునికి అవిధేయులైయుండి, ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి."
"అటువలెనే మీ యెడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందునిమిత్తము, ఇప్పుడు వారు అవిధేయులై యున్నారు."
అందరియెడల కరుణ చూపవలెనని దేవుడు అందరిని అవిధేయ తాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు.
"ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గము లెంతో అగమ్యములు."
ప్రభువు మనస్సు నెరిగిన వాడెవడు ? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ?
"ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొందగలవాడెవడు?"
"ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి యున్నవి. యుగములవరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్."