:

Romans 14

1

విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు.

2

"ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు. మరియొకడు బలహీనుడైయుండి, కూరగాయలనే తినుచున్నాడు."

3

"తినువాడు తినని వానిని తృణీకరింప కూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు.; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను."

4

పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి యుండుటయైనను పడియుండుట యైనను అతని సొంత యజమానుని పనియే.; అతడు నిలుచును ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.

5

ఒకడు ఒక దినము కంటె మరియొక దినము మంచిదని ఎంచుచున్నాడు; మరియొకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢి పరచుకొనవలెను.

6

"దినమును లక్ష్యపెట్టువాడు, ప్రభువు కోసరమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసరమే తినుచున్నాడు; తిననివాడు ప్రభువుకోసరము తినుట మాని, దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాడు."

7

మనలో ఎవడును తన కోసరమే బ్రతుకడు. ఎవడును తన కోసరమే చనిపోడు.

8

మనము బ్రతికినను ప్రభువు కోసరమే బ్రతుకు చున్నాము; చనిపోయినను ప్రభువు కోసరమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమైయున్నాము.

9

"తాను మృతులకును, సజీవులకును ప్రభువై యుండుటకు, ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికెను."

10

అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింప నేల? మన మందరము దేవుని న్యాయపీఠము యెదుట నిలుతుము.

11

"నాతోడు ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు"

12

అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను.

13

"కాగా మనమిక మీదట ఒకని కొకు తీర్పు తీర్చకుందము. ఇదియు గాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయ కుందుమని మీరు నిశ్చయించుకొనుడి."

14

"సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసు నందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకొను వానికి, అది నిషిద్ధమే."

15

నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినయెడల నీవికను ప్రేమ కలిగి నడచుకొనువాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడుచేయకుము.

16

మీకున్న మేలైనది దూషణ పాలు కానియ్యకుడి.

17

"దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది."

18

ఈ విషయమునందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు.

19

కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము.

20

భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి; సమస్త పదార్ధములు పవిత్రములే కాని అనుమానముతో తినువానికి అది దోషము.

21

"మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని మానివేయుట మంచిది."

22

నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు.

23

"అనుమానించువాడు తినిన యెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అదిపాపము."

Link: