Romans 9
నాకు బహు దుఃఖమును నా హృదయములో మానవి వేదనయు కలవు.
"క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు."
పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్థునై యుండగోరెదను.
"వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలును, ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును, వాగ్దానములును వీరివి."
"పితరులు వీరి వారు. శరీరమును బట్టి, క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్. దేవుని వాగ్దానములు నిరర్థకము కాలేదు"
అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు.
అబ్రాహాము సంతానమైనంత మాత్రమున అందరును పిల్లలు కారు కాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానమనబడును.
"అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కాని, వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు."
"వాగ్దాన రూపమైన వాక్యమిదే - మీదటికి ఈ సమయమునకు వచ్చెదను, అప్పటికి శారాకు కుమారుడు కలుగును."
"అంతే కాదు, రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి యైనప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని"
"మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము, పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే"
పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.
"ఇందును గూర్చి - నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది."
కాబట్టి ఏమందుము ? దేవుని యందు అన్యాయము కలదా ? అట్లనరాదు.
అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు - ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవని యెడల జాలి చూపుదునో వాని యెడల జాలి చూపింతును.
"కాగా పొందగోరువాని వలననైనను ప్రయాసపు వాని వలనైనను కాదు గాని, కరుణించు దేవుని వలననే జరుగును."
"మరియు, లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను - నేను నీయందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతట ప్రచురమగుటకును, అందునిమిత్తమే నిన్ను నియమించితిని."
"కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవనిని కఠిన పరచగోరునో వాని కఠినపరచును."
అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల? అని నీవు నాతో చెప్పుదువు:
"అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు ? నన్నెందుకీలాగు చేసితివని రూపించబడినది రూపించిన వానితో చెప్పునా ?"
"ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?"
"ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిన నేమి?"
మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల యెడల
అనగా యూదులలో నుండియు మాత్రము కాక అన్య జనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల తన మహిమైశ్వర్యము కనపరచవలెనని యున్ననేమి?
"నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును."
"మరియు జరుగునదే మనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు."
"మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక, ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె నుండినను, శేషమే రక్షింపబడునని"
యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకు చున్నాడు.
"మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము - సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింపచేయకపోయిన యెడల సొదొమవలె నగుదుము, గొమొర్రాను పోలియుందుము."
అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి;
"అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను, ఆ నియమమును అందుకొనలేదు."
"వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక, క్రియలమూలముగా నైనట్టు దానిని వెంటాడిరి."
ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడిరి.