:

Acts 15

1

"అన్యజనులలో నుండి వచ్చిన క్రైస్తవులు - మోషే ధర్మశాస్త్రము కొందరు యూదయనుండి వచ్చి, మీకు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి."

2

"పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు, తమలో మరికొందరును యెరూషలేములో అపొస్తలుల యొద్దకును, పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి."

3

"కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి ఫేనీకే సమరయ దేశముల ద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహాసంతోషము కలుగజేసిరి."

4

వారు యెరూషలేముకు రాగా సంఘపు వారును అపొస్తలును పెద్దలును వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడైయుండి చేసినవన్నియు వారు వివరించిరి.

5

"పరిసయ్యులు తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలెననియు వారికి చెప్పిరి."

6

అప్పుడు అపొస్తలులును పెద్దలును ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను -

7

"సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును."

8

మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను.

9

"వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి, మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు."

10

గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు?

11

ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురనెను.

12

"అంతట ఆ జన సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసి సూచక క్రియలను, అద్భుతములను వివరించగా ఆలకించెను."

13

"వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను - సహోదరులారా, నా మాట ఆలకించుడి."

14

అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచు కొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించి యున్నాడు.

15

ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; ఎట్లనగా -

16

"ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను, మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువును వెదకునట్లు"

17

"పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలబెట్టెదనని"

18

అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిచ్చు చున్నాడు అని వ్రాయబడియున్నది.

19

"కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక,"

20

"విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపినదానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము."

21

"ఏలయనగా, సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను."

22

"అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను, సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను"

23

"వీరు వ్రాసి వారిచేత పంపినదేమనగా - అపొస్తలులను, పెద్దలైన సహోదరులును, అంతియొకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము -"

24

కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేమధికారమిచ్చి యుండలేదు.

25

"గనుక మనుష్యులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడ"

26

మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను.

27

"కాగా యూదాను సీలను పంపియున్నాము, వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు."

28

"విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను."

29

ఈ అవశ్యమైన వాటి కంటె ఎక్కువైన భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగునుగాక.

30

అంతట వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక యిచ్చిరి.

31

వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి.

32

మరియు యూదాయు సీలయు కూడ ప్రవక్తలై యుండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి

33

వారు అక్కడ కొంత కాలము గడిపి సహోదరుల యొద్ద నుండి

34

తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్లుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి.

35

"అయితే పౌలును బర్నబాయు అంతియొకయలో నిలిచి ఇంక అనేకులతో కూడ ప్రభువు వాక్యము బోధించుచు, ప్రకటించుచునుండిరి"

36

కొన్ని దినములైన తరువాత - ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి వారే లాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో ననెను.

37

అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను.

38

అయితే పౌలు పంపూలియలో పని కొరకు తమతో కూడ రాక తమ్మును విడచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలచెను.

39

వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను.

40

"పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగించబడినవాడై బయలుదేరి,"

41

సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.

Link: