Acts 25
ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరయనుండి యెరూషలేమునకు వెళ్లెను.
"అప్పుడు ప్రధాన యాజకులును, యూదులలో ముఖ్యులును పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదుసంగతి అతనికి తెలియజేసిరి."
మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి యుండి - మీరు దయచేసి అతనిని యోరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి ఫేస్తునొద్ద మనవి జేసిరి.
"అందుకు ఫేస్తు - పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడకు వెళ్లబోవుచున్నాను."
గనుక మీలో సమర్ధులైన వారు నాతో కూడ వచ్చి ఆ మనుష్యుని యందు తప్పిదమేదైన యుంటే అతనిమీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను.
"అతడు వారియొద్ద ఎనిమిది, పది దినములు గడిపి కైసరయకు వెళ్లి మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి, పౌలును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను."
"పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములనేకములను మోపిరి, గాని వాటిని రుజువు చేయలేక పోయిరి."
"అందుకు పౌలు - యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెన్నడును ఎంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను."
"అయితే ఫేస్తు యూదుల చేత మంచి వాడనిపించుకొన వలెనని - యెరూషలేమునకు వచ్చి, అక్కడ నా యెదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీ కిష్టమా? అని పౌలు నడిగెను."
అందుకు పౌలు - కైసరు న్యాయపీఠము యెదుట నిలువబడి యున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే. యూదులకు నేను అన్యాయ మేమియు చేయలేదని తమరికి బాగుగా తెలియును.
నేను న్యాయము తప్పి మరణమునకు తగిన దేదైనను చేసినయెడల మరణమునకు వెనుతీయను; వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కానియెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను.
"అప్పుడు ఫేస్తు తన సభ వారితో ఆలోచన చేసిన తరువాత - కైసరు యెదుట చెప్పుకొందునంటివే, కైసరు వద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను."
"కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు, బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసుకొనుటకు కైసరయుకు వచ్చిరి."
"వారక్కడ అనేక దినములుండగా, ఫేస్తు పౌలు సంగతి రాజునకు తెలియజెప్పెను; ఏమనగా - ఫేలిక్సు విడిచిపెట్టి పోయిన యొక ఖైదీ యున్నాడు."
నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి.
అందుకు నేను - నేరము మోపబడినవాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యక మునుపు ఏ మనుష్యుని నైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని.
కాబట్టి వారిక్కడ కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియు చేయక మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి ఆ మనుష్యుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించితిని.
"నేరము మోపిన వారు నిలిచినప్పుడు, నేననుకొనిన నేరములలో ఒకటియైనను అతని మీద మోపిన వారు కారు."
"అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను."
"ఆ యేసు బ్రతికి యున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై ఏలాగున విచారింపవలెనో ఏమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతని కిష్టమవునేమోయని అడిగితిని."
"అయితే పౌలు, చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి యుంచవలెనని చెప్పికొనినందున నేనతనిని కైసరు నొద్దకు పంపించువరకు నిలిపి ఉంచవలెనని ఆజ్ఞాపించితిననెను."
"అందుకు అగ్రిప్ప - ఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో ననగా, అతడు - రేపు వినవచ్చునని చెప్పెను."
"కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపతులతోను పట్టణమందలి ప్రముఖులతోను అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనీయగా పౌలు తేబడెను."
"అప్పుడు ఫేస్తు - అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతోఉన్న సమస్తజనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను, ఇక్కడను యూదులందరు - వీడు ఇక బ్రతుక తగని కేకలు వేయుచు అతని మీద నాతో మనవి చేసుకొనిరి."
ఇతడు మరణమునకు తగినదేమియు చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి యెదుట చెప్పుకొందుననిఅనినందున ఇతనిని పంప నిశ్చయించి యున్నాను.
"ఇతని గూర్చి మన యేలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనదియు ఏమియు కనబడనందున విచారణయైన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని, అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ యెదుటికిని ఇతని రప్పించి యున్నాను."
ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండ అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పెను.