:

Ephesians 5

1

కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడుచుకొనుడి.

2

క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమ గలిగి నడుచుకొనుడి.

3

"మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని ఉండకూడదు. వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశద్ధులకు తగినది."

4

"మరియు కృతజ్ఞతావచనమే మీరు ఉచ్ఛరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు."

5

"వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభియైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును."

6

వ్యర్థమైన మాట వలన ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి;

7

"ఇట్టి క్రియలవలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక, మీరు అట్టి వారితో పాలివారై యుండకుడి."

8

మీరు పూర్వమందు చీకటియై యుంటిరి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై యున్నారు.

9

"వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది."

10

"గనుక ప్రభువు కేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడచుకొనుడి."

11

నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై యుండక వాటిని ఖండించుడి.

12

ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.

13

సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే గదా?

14

"అందుచేత - నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు."

15

"దినములు చెడ్ఢవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగముచేసుకొనుచు"

16

"అజ్ఞానులవలె గాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి."

17

ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.

18

"మరియు మద్యముతో మత్తులై యుండకుడి, దానిలో దుర్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులై యుండుడి."

19

"ఒకని నొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువు గూర్చి పాడుచు కీర్తించుచు,"

20

"మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,"

21

క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.

22

"స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి."

23

క్రీస్తు సంఘమునకు శిరస్ష్సె యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్ష్సె యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు.

24

"సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా, భార్యలు కూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను."

25

"పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి."

26

అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి.

27

"అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరచి, పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను."

28

అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొను చున్నాడు.

29

తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.

30

మనము క్రీస్తు శరీరమునకు అవయవములైయున్నాము గనుక ఆలాగే క్రీస్తు కూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.

31

ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరు ఏక శరీరమగుదురు.

32

ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను.

33

"మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను."

Link: