John 2
మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను.
"యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును, ఆయన శిష్యులును ఆ వివాహామునకు పిలువబడిరి"
"ద్రాక్షారసమై పోయినప్పుడు, యేసు తల్లి - వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా,"
"యేసు ఆమెతో- ''అమ్మా, నాతో నీకేమి పని ? నా సమయమింకను రాలేదు'' అనెను."
ఆయన తల్లి పరిచారకులను చూచి - ఆయన మీతో చెప్పునది చేయుడనెను.
యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచ బడియుండెను
"యేసు - ''ఆ బానలు నీళ్లతో నింపుడి'' అని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి."
"అప్పుడాయన వారితో - ''మీరిప్పుడు ముంచి, విందు ప్రధాని యొద్దకు తీసికొనిపోండి'' అని చెప్పగా, వారు తీసికొసిపోయిరి."
"ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియక పోయెను, గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధానిపెండ్లి కుమారుని పిలిచి -"
"ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొనియున్నావని అతనితో చెప్పెను."
"గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి."
"అటుతరువాత ఆయనయు, ఆయన తల్లియు, సహోదరులును, ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి."
"యూదులు పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషమునకు వెళ్లి,"
"దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి,"
"త్రాళ్లతో కొరలుచేసి, గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయములో నుండి తొలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి,"
పావురములు అమ్మువారితో- ''వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి'' అని చెప్పెను.
ఆయన శిష్యులు ''నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించు చున్నది'' (కీర్తనలు69:9) అని వ్రాయబడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి.
"కాబట్టి యూదులు - నీవు ఈ కార్యములు చేయుచున్నావే; ఏ సూచకక్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా,"
"యేసు - ''ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదును'' అని వారితో చెప్పెను."
యూదులు - ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దినములలో దానిని లేపుదువా? అనిరి.
అయితే ఆయన తన శరీరమను దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను.
"ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి."
"ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి."
"అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు,"
గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు.