:

John 7

1

యేసు - ఆయన సహోదరులు అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను.

2

"యూదులు పర్ణశాలల పండుగ సమీపించెను గనుక,"

3

ఆయన సహోదరులు ఆయనను చూచి - నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము.

4

బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవె లోకమునకు కనబరచుకొనుమని చెప్పిరి.

5

ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.

6

యేసు - ''నా సమయమింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.

7

"లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని, దాని క్రియలు చెడ్ఢవని నేను దానిని గూర్చి సాక్ష్య మిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది."

8

మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణముకాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లను'' అని వారితో చెప్పెను.

9

ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను.

10

అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను.

11

పండుగలో యూదులు - ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి.

12

మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొందరాయన మంచివాడనిరి; మరికొందరు - కాడు; ఆయన జనులను మోసపుచ్చువాడనిరి;

13

అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాటలాడలేదు.

14

సగము పండుగైననప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించు చుండెను.

15

యూదులు అందుకు ఆశ్చర్యపడి - చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి.

16

అందుకు యేసు - ''నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.

17

"ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనియెడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును."

18

"తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియులేదు."

19

మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా ? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారు'' అని వారితో చెప్పెను.

20

"అందుకు జన సమూహము - నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంపచుచున్నాడని అడుగగా,"

21

యేసు వారిని చూచి - ''నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడుచున్నారు.

22

"మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు."

23

మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా? ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద అగ్రహపుచున్నారేమి?

24

వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయ మైన తీర్పు తీర్చుడి'' అనెను.

25

యోరూషలేము వారిలో కొందరు - వారు చంపవెదకువాడు ఈయనే కాడా?

26

ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తుని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా?

27

ఆయనను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడును ఎరుగని చెప్పుకొనిరి.

28

"కాగా యేసు దేవాలయములో బోధించుచు - ''మీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యింతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు."

29

నేను ఆయన యొద్ద నుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదును'' అని బిగ్గరగా చెప్పెను.

30

అందుకు వారాయనను పట్టుకొన యత్నము చేసిరి గాని ఆయన గ డియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.

31

మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచి - క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటి కంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా? అని చెప్పుకొనిరి.

32

"జనసమూహము ఆయనను గూర్చి ఈలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధాన యాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి."

33

యేసు - ఇంక కొంత కాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపివాని యొద్దకు వెళ్లుదును;

34

"మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను."

35

అందుకు యూదులు - మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవు చున్నాడు ? గ్రీసు దేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసు దేశస్థులకు బోధించునా ?

36

"నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి."

37

ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి - ''ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.

38

నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారును'' అని బిగ్గరగా చెప్పెను.

39

తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి యుండలేదు.

40

జనసమూహములో కొందరు ఈ మాటలు విని- నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి;

41

మరికొందరు - ఈయన క్రీస్తే అనిరి; మరికొందరు - ఏమి ? క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా ?

42

క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమును గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా? అనిరి.

43

కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను.

44

వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు.

45

"ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు - ఎందుకు మీరాయనను తీసికొనిరాలేదని అడుగగా,"

46

ఆ బంట్రౌతులు - ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనిరి.

47

అందుకు పరిసయ్యులు - మీరుకూడ మోసపోతిరా?

48

అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా?

49

అయితే ధర్మశాస్త్ర మెరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి.

50

అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు.

51

"అతడు - ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా? అని అడుగగా,"

52

"వారు - నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి."

53

అంతట ఎవరి యింటికి వారు వెళ్ళిరి.

Link: