:

Luke 6

1

ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలోబడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు పంటవెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి.

2

"అప్పుడు పరిసయ్యులలో కొందరు - విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయు చున్నారని వారి నడుగగా,"

3

యేసు వారితో - ''తానును తనతో కూడ ఉన్నవారును ఆకలి గొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అదియైనా మీరు చదువలేదా ?

4

"అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని, తనతో కూడ ఉన్నవారికి యిచ్చెను గదా'' అనెను."

5

''కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడు'' అని వారితో చెప్పెను.

6

మరియొక విశ్రాంతి దినమున ఆయన సమాజమందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడిచెయ్య గలవాడొకడుండెను.

7

శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమోయని ఆయనను కనిపెట్టుచుండిరి.

8

అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఊచచెయ్యి గలవానితో ''నీవు లేచి మధ్యను నిలుచుండుము'' అని చెప్పగా వాడు లేచి నిలుచుండెను.

9

"అప్పుడు యేసు - ''విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా ? కీడు చేయుట ధర్మమా? ప్రాణ రక్షణ ధర్మమా? ప్రాణహత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నాను'' అని వారితో చెప్పి,"

10

"వారి నందరిని చుట్టూ కలయచి ''నీ చెయ్యి చాపుము'' అని వానితో చెప్పగా, వాడాలాగు చెయ్యగానే వాని చెయ్యి బాగుపడెను."

11

"అప్పుడు వారు వెఱ్ఱికోపముతో నిండుకొని, యేసును ఏమి చెయుదుమా అని యొకనితొ ఒకడు మాటలాడుకొనిరి"

12

ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ఒక రాత్రంతయు దేవునికి ప్రార్థించుచు గడిపెను.

13

"ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పన్నెండు మందిని ప్రత్యేకముగా ఏర్పరచుకొని వారికి అపొస్తలులని పేరు పెట్టెను."

14

"ఆ పన్నెండు మంది ఎవరనగా - పేతురు అని ఎవరికైతే ఆయన మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి,"

15

"మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను"

16

"యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారలు."

17

"ఆయన వారితో కూడ దిగి వచ్చి మైదానమందు నిలువ బడినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును, ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమందంతటి నుండియు యెరూషలేము నుండియు, తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండియు వచ్చిన బహు జన సమూహమును"

18

అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి.

19

ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరిని స్వస్థ పరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసెను.

20

"అంతట ఆయన తన శిష్యులవైపు పారచూచి - ''బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది."

21

"ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు."

22

"మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి, మీ పేరు చెడ్ఢదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు."

23

ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదగును. వారి పితరులు ప్రవక్తలకు అదే చేసిరి.

24

"అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొందియున్నారు;"

25

"అయ్యో, ఇప్పుడు కడుపు నిండియున్న వారలారా, మీరాకలిగొందురు. అయ్యో, యిప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్చుదురు."

26

మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి.

27

వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా - మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి;

28

మిమ్మును శపించు వారిని దీవించుడి; మిమ్మును బాధించు వారికొరకు ప్రార్థన చేయుడి.

29

నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడ త్రిప్పుము. నీపై బట్ట యెత్తికొని పోవు వానిని నీ అంగీని కూడ ఎత్తికొని పోకుండ అడ్డగింపకుము.

30

నిన్నడుగు ప్రతివానికి యిమ్ము; నీ సొత్తు ఎత్తికొని పోవు వాని వద్ద నుండి దానిని మరల అడగవద్దు.

31

మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.

32

మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును ? పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా.

33

మీకు మేలు చేసినవారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పు కలుగును ? పాపులును ఆలాగే చేతురు కదా.

34

మీరెవరి వద్ద నుండి మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పుయిచ్చిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు యిచ్చెదరు గదా.

35

"మీరైతే ఎట్టివారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదై యుండును; మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి యెడలను దుష్టుల యెడలను, ఉపకారియై యున్నాడు."

36

కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై యున్నట్టు మీరును కనికరము గలవారై యుండుడి.

37

"తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి; అప్పుడు మీ మీద నేరము మోపబడదు."

38

"క్షమించుడి, అప్పుడు మీరు క్షమించ బడుదురు; ఇయ్యుడి అప్పుడు మీకీయబడును; అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనె మీకు మరల కొలువబడును'' అని చెప్పెను."

39

మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను - ''గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా ? వారిద్దరును గుంటలో పడుదురు గదా?

40

శిష్యుడు తన బోధకుని కంటె అధికుడు గాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె నుండును.

41

నీవు నీ కంటిలో ఉన్న దూలమునెంచక నీ సహోదరునికంటిలోనున్న నలుసును చూడనేల ?

42

". నీ కంటిలో నున్న దూలమును చూడక నీ సహోదరునితో- సహోదరుడా, నీ కంటిలో నున్న నలుసును తీసివేయ నిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును."

43

"ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలించవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు."

44

ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పళ్ళు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్ష పళ్ళు కోయరు.

45

"సజ్జనుడు తన హృదయమను మంచి ధన నిధిలో నుండి మంచి విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు తన చెడ్ఢ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును, హృదయము నిండి యుండు దానిని బట్టి యొకని నోరు మాటలాడును."

46

"నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, ప్రభువా!ప్రభువా! యని నన్ను పిలుచుట ఎందుకు ?"

47

నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును.

48

"వాడు యిల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసిన వాడిలా నుండును. వరద వచ్చి ప్రవాహము ఆ యింటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను."

49

"అయితే నా మాటలు వినియు, చేయని వాడు పునాది వేయక నేల మీద యిల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పెను, ఆ యింటి పాటు గొప్పది''"

Link: