:

Luke 8

1

"ఆ తరువాత యేసు దేవుని రాజ్యసువార్తను ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచరించుచుండగా,"

2

"పన్నెండు మంది శిష్యులను, అపవిత్రాత్మలును, వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ నుండిరి."

3

వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి.

4

"బహుజనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా, ఆయన ఉపమాన రీతిగా వారితో యేసు, నిట్లనెను-"

5

"''ఒక రైతు తన విత్తనములను విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడి త్రొక్కబడెను, పక్షులు వచ్చి వాటిని తిని వేసెను."

6

"కొన్ని రాతి నేలను పడెను, అవి మొలిచి చెమ్మలేనందు వలన ఎండిపోయెను."

7

మరి కొన్ని ముండ్ల పొదలలో పడెను. వాటితో కూడ ముండ్ల పొదలు మొలిచి వాటిని నణచి వేసెను.

8

మరి కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెను'' ఈ మాటలు పలుకుచు- ''వినుటకు చెవులున్నవాడు వినును గాక'' అని బిగ్గరగా చెప్పెను.

9

"ఆయన శిష్యులు - ఈ ఉపమాన భావమేమిటని ఆయన నడుగగా,"

10

"ఆయన - ''దేవుని రాజ్యమర్మము ఎరుగుటకు మీకనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపక వుండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి."

11

ఈ ఉపమానము యొక్క అర్థమేమనగా- విత్తనము దేవుని వాక్యము.

12

"త్రోవ ప్రక్క నుండువారు, వారు వాక్యమును విందురు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు సాతాను వచ్చి వారి హృదయములలో నుండి ఆ వాక్యము నెత్తికొని పోవును."

13

"రాతినేల నుండు వారెవరనగా, వినినప్పుడు వాక్యమునెంతో సంతోషముగా అంగీకరింతురు, వారికి వేరు లేనందున కొంచెము కాలమే నమ్మి శోధనలొచ్చినప్పుడు తొలగిపోవుదురు."

14

"ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, వాక్యమును విని కాలము గడచుకొలది సుఖదుఃఖముల చేత, ధనభోగముల చేత అణచివేయబడి సంపూర్ణముగా ఫలించని వారు."

15

"మంచి నేలను పడిన విత్తనములను పోలినవారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని హృదయములలో దానిని భధ్ర పరచుకొని దానిని అనుసరించి మంచి ఫలములను ఫలించువారు''"

16

"ఎవడును దీపము ముట్టించి పాత్ర క్రిందనో మంచము క్రిందనో పెట్టడు గాని, అందరికి వెలుగు నిచ్చుటకు దానిని ఎత్తైన దీపస్తంభము మీద పెట్టును."

17

"తేటపరచబడని రహస్యమేదియు లేదు, తెలియజేయబడకయు బయలు పడకయు ఉండు మరుగైన దేదియు లేదు."

18

"కలిగిన వానికి యియ్యబడును, లేని వాని యొద్ద నుండి వాని కున్నది కూడ తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడి'' అని చెప్పెను"

19

"ఆయన తల్లియు ఆయన సోదరులును ఆయన యొద్దకు వచ్చి, జనులు గుంపులుగా నుండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి."

20

"అప్పుడు ఎవరో వచ్చి నీ తల్లియు సోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని ఆయనకు తెలియజేయగా,"

21

ఆయన - ''దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులును'' అని వారితో చెప్పెను.

22

మరియొకనాడు ఆయన తన శిష్యులతో కూడ దోనె యొక్కి ''సముద్రపు ఆవలి ఒడ్డునకు పోవుదము'' అని చెప్పగా వారంతా ఒక దోనెలో బయలుదేరిరి.

23

ప్రయాణములో ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన అకస్మాత్తుగా వచ్చి దోనె నీళ్ళతో నిండిన కారణముగా వారు అపాయస్థితిలో నుండిరి.

24

"శిష్యులు యేసునొద్దకు వచ్చి ఆయనను నిద్రనుండి లేపుచు - ''ప్రభువా, ప్రభువా మేము మునిగి పోవుచున్నాము నశించిపోవుచున్నాము'' అని చెప్పగా యేసు లేచి ఆ గాలిని నీటిని ఆగమని గద్దించగా అవి అణగి నిమ్మళమాయెను."

25

"అప్పుడాయన ''మీ విశ్వాసమేమైనది'' అని వారి నడిగిను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీటికిని ఆజ్ఞాపించగా, అవి లోబడుచున్నవే; ఈయన ఎవరో అని ఆశ్చర్యపడి - ఈయన ఎంత గొప్ప వాడోనని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి."

26

వారు గలిలయకు ఎదురుగా నుండు గెరసీనుల దేశమునకు వచ్చిరి.

27

ఆయన ఒడ్డున దిగినప్పుడు దయ్యముపట్టిన ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు బహు కాలమునుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని యింటనుండెడివాడు గాడు.

28

"వాడు యేసుని చూచి, కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి - యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని కేకలు వేసెను."

29

"ఏలయనగా ఆయన- ''ఈ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్ము'' అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచు వచ్చెను గనుక వానిని గొలుసులతోను కాలిసంకెళ్ళ తోను కట్టి కావలి యందుంచిరి గాని, వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తోలుకొని పోయెను."

30

"యేసు- ''నీ పేరేమి?'' అని వాని నడుగగా, చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను"

31

"గనుక వాడు తన పేరు సేన, యని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను."

32

అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను.

33

అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద అక్కడ నుండి వడిగా పరుగెత్తి కొండనుండి క్రిందికి దిగి సముద్రములోపి ఊపిరి తిరుగక చచ్చెను.

34

"మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి, ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి."

35

"జనులు జరిగినదానిని చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై, యేసు పాదముల యొద్ద కూర్చుండియుండుట చూచి భయపడిరి."

36

"అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడేలాగు స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా,"

37

గెరసీనీయుల ప్రాంతములోనుండిన వారందరు బహుభయబ్రాంతులైరి.

38

"గనుక తమ్మును విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోనె ఎక్కి తిరిగి వెళ్ళు చుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతో కూడ తన్నుండనిమ్మని ఆయనను వేడుకొనెను."

39

"అయితే ఆయన- ''నీవు నీ యింటికి తిరిగి వెళ్ళి, దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయుము'' అని వానితో చెప్పి వాని పంపివేసెను; వాడు వెళ్ళి యేసు తన కెట్టి గొప్పకార్యములు చేసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించెను."

40

జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.

41

"ఆ సమయములో సమాజ మందిరమునకు అధిపతియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి,"

42

ఇంచుమించు పన్నేండేళ్ళ యీడు గల ఒక్కతేయైన తన కుమార్తె చనిపోవుటకు సిద్ధముగా నున్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి.

43

"అప్పుడు పన్నెండేళ్ళనుండి రక్తస్రావ రోగముతో బాధ పుచున్న యొక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై, ఆయన వెనుకకు వచ్చి,"

44

ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.

45

"''నన్ను ముట్టినది ఎవరు'' అని యేసు అడుగగా, అందరును - మేమెరుగమన్నప్పుడు, పేతురు, -ఏలినవాడ, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా;"

46

యేసు ''ఎవరో నన్ను ముట్టిరి. నా నుండి ప్రభావము వెళ్ళుట నేను గమనించితిని'' అనెను.

47

"తాను మరుగైయుండలేనని గ్రహించిన ఆ స్త్రీ, వణకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్త మాయనను ముట్టెనో, వెంటనే తానేలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి యెదుట చెప్పెను."

48

"అందుకాయన-, ''కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను; సమాధానము గలదానవై పొమ్ము'' అని చెప్పెను."

49

"ఆయన ఇంకను మాటలాడు చుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి యొకడు వచ్చి, - నీ కుమార్తె చనిపోయినదనియు బోధకుని శ్రమపెట్టవద్దనియు అతనితో చెప్పెను."

50

"యేసు ఆ మాట విని ''భయపడవద్దు. నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడును'' అని అతనితో చెప్పి"

51

"ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానీయలేదు."

52

". అందరును ఆమె నిమిత్తము యేడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా, ఆయన వారితో - ''యేడ్వవద్దు, ఆమె నిదిరించుచున్నదే గాని చనిపోలేదు'' అని చెప్పెను."

53

. ఆమె చనిపోయెనని వారెరిగి ఆయన నపహసించిరి.

54

". అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని ''చిన్నదానా, లెమ్ము'' అని చెప్పగా,"

55

. ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను.

56

. ఆమె తలిదండ్రులు విస్మయమొందిరి. అంతట ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దు'' వారి కాజ్ఞాపించెను.

Link: