:

Mark 12

1

ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపసాగెను; ఎట్లనగా- ''ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టు కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్త కిచ్చి దేశాంతరము పోయెను.

2

"పంట కాలమందు ఆ కాపుల నుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా,"

3

"వారు వాని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి,"

4

"మరల అతడు మరియొక దాసుని వారి యొద్దకు పంపగా, వారు వానిని తల గాయము చేసి అవమాన పరచిరి."

5

"అతడు మరియొకని పంపగా వానిని చంపిరి. అతడింక అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, మరి కొందరిని చంపిరి."

6

ఇంకను అతనికి ప్రియ కుమారుడొకుండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారియొద్దకు అతనిని పంపెను.

7

"అయితే ఆ కాపులు - ఇతడు వారసుడు; ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని,"

8

అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి.

9

"కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును ? అతడు వచ్చి, ఆ కాపులను సంహరించి, ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును గదా? మరియు"

10

ఇల్లుకట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను-

11

"ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము, అను లేఖనము మీరు చదువలేదా ?'' అని అడుగగా,"

12

తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి.

13

వారు మాటలలో ఆయనను చిక్కు పరచవలెనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి.

14

"వారు వచ్చి- బోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవరిని లక్ష్యపెట్టని వాడవని మే మెరుగుదుము; నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా?"

15

ఇచ్చెదమా? ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణ నెరిగి- ''మీరు నన్నెందుకు శోధించుచున్నారు ? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడి'' అని వారితో చెప్పెను.

16

"వారు తెచ్చిరి, ఆయన - ''ఈ రూపమును పై వ్రాతయు ఎవరివి? '' అని వారి నడుగగా, వారు - కైసరువి అనిరి."

17

"అందుకు యేసు - ''కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి'' అని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి."

18

పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయన యొద్దకు వచ్చి-

19

"బోధకుడా, తన భార్య బ్రతికి యుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను."

20

ఏడుగురు సహోదరులుండిరి. మొదటి వాడు ఒక స్త్రీని పెండ్లిచేసుకొని సంతానము లేక చనిపోయెను.

21

గనుక రెండవ వాడు ఆమెను పెండ్లి చేసుకొనెను; వాడును సంతానము లేక చనిపోయెను.

22

"అటువలెనే మూడవ వాడును చనిపోయెను. ఇట్లు ఏడుగురును సంతానము లేకనే చనిపోయిరి, అందరి వెనుక ఆ స్త్రీయును చనిపోయెను."

23

పునరుత్థానమందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ ఏడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి.

24

అందుకు యేసు- ''మీరు లేఖములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుటవలననే పొరబడుచున్నారు

25

"వారు మృతులలో నుండి లేచునప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లి కియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె ఉందురు."

26

వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథ మందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా ? ఆ భాగములో దేవుడు- నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను.

27

ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు గాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారు'' అని వారితో చెప్పెను.

28

"శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయననడిగెను."

29

"అందుకు యేసు ''ప్రధానమైనది ఏదనగా - ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు,"

30

"నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణబలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ,"

31

"రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియులేదు'' అని అతనితో చెప్పెను."

32

"ఆ శాస్త్రి- బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేనియు నీవు చెప్పిన మాట సత్యమే."

33

"పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువారిని ప్రేమించుటయు, సర్వాంగ హోమములన్నిటికంటెను, బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను."

34

అతడు వివేకముగా ఉత్తరమిచ్చెనని యేసు గ్రహించి ''నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు'' అని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

35

"ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా, ''క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి ?"

36

నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెనని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను.

37

"దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగును ?'' అని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి."

38

"మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను. - ''శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను,"

39

సమాజ మందిరములలో అగ్ర పీఠములను విందులలో అగ్ర స్థానములను కోరుచు

40

విధవరాండ్ర ఇండ్లు దిగమ్రింగుచు మాయ వేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు'' అనెను.

41

"ఆయన కానుక పెట్టె యెదుట కూర్చుండి, జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు దానిలో విశేషముగా సొమ్ము వేయుచుండిరి."

42

"ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా,"

43

"ఆయన తన శిష్యులను పిలిచి- ''కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరి కంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను,"

44

వారందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన దంతయు అనగా తన జీవనమంతయు వేసెను'' అని చెప్పెను.

Link: