Mark 4
ఆయన సముద్ర తీరమున తిరిగి బోధింప నారంభింపగా బహు జనులాయన చుట్టూ మూగి యున్నందున ఆయన సముద్రములో ఒక దోనె నెక్కి కూర్చొనగా జనులందరు సముద్ర తీరమున నేల మీద నుండిరి.
ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులను వారికి బోధించుచు వారితో ఇట్లనెను- '' వినుడి
ఒక రైతు విత్తనములు తీసుకొని విత్తుటకు బయలు వెళ్ళెను.
అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కనపడెను.
"ఆకాశ పక్షులు వచ్చి వాటిని మ్రింగి వేసెను. కొన్ని విత్తనములు మన్ను లేని రాతి నేలను పడెను, అవి వెంటనే మొలిచెను కాని మన్ను లోతుగా లేనందున"
సూర్యుడు ఉదయింపగానే ఆ వేడికి మాడిపోయి వేరు లేనందున ఎండిపోయెను.
"కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటి నణచి వేసెను గనుక అవి ఫలింపలేదు."
"కొన్ని విత్తనములు మంచి నేలను పడెను. అవి మొలకెత్తి ఎదిగి ముప్పదంతలు గాను, అరువదంతలు, గాను నూరంతలు గాను ఫలించెను."
వినుటకు చెవులున్నవాడు వినును గాక'' అని చెప్పెను.
"ఆయన ఏకాంతముగా ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు, వారితో కూడ ఉన్నవారు వచ్చి ఆ ఉపమానభావమును తెలుసుకొన గోరిరి."
"అందుకాయన ''దేవుని రాజ్య మర్మము తెలిసికొనుట మీకు అనుగ్రహింపబడినది,"
"గాని ప్రవక్త చెప్పినట్లుగా వారు ''నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. నిత్యము చూచుచుందురుగాని తెలిసికొనకుందురు;'' (యెషయా6:9) ''వెలుపల నుండువారు ఒక వేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియును గ్రహింపకయు ఉండుటకును వారికి అన్నియు ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి'' అని వారితో చెప్పెను."
మరియు ఆయన వారితో ''ఈ ఉపమానము మీకు తెలియదా ? ఆలాగైతే ఉపమానములన్నియు మీకేలాగు తెలియును? అనెను.
విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు.
త్రోవ ప్రక్కననుండు వారెవరనగా- వాక్యము వారిలో విత్తబడును గాని వినిన వెంటనే సాతాను వచ్చి విత్తబడిన వాక్యమును ఎత్తికొనిపోవును.
"రాతి నేలను విత్తబడిన వారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు."
"అయితే వారిలో వేరు లేనందున కొంత కాలము వారు నిలుతురు కాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు అభ్యంతర పడుదురు, దాన్ని వెంటనే వదలి వేయుదురు."
ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడినవారు.
"వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములు, ధనమోసమును మరియు ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును."
"మంచి నేలను విత్తబడిన వారెవరనగా- వాక్యము విని, దానినంగీకరించి ముప్పదంతలుగాను, అరువ దంతలుగాను నూరంతలు గాను ఫలించువారు'' అని చెప్పెను."
యేసు వారితో ఇట్లనెను- ''దీపము దీపస్తంభము మీద ఉంచబడుటకే గాని కుంచము క్రిందనో మంచము క్రిందనో ఉంచబడుటకు గాదు.
రహస్యమైనవన్నియు బయలుపరచబడకపోవు. దాచబడినవన్నియు బహిరంగము చేయబడును.
వినుటకు చెవులున్నవాడు వినును గాక. మరియు ఆయన-
మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగాచూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుచుదురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకీయబడును.
"కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని నొద్ద నుండి వానికున్న కొంచెమును తీసివేయబడును."
"మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిదిరించుచు, మేల్కొనుచు ఉండగా"
వానికి తెలియని రీతిలో ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది.
భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పంటను పండిస్తుంది.
కోతకాలము వచ్చినప్పుడు సేద్యగాడు వెంటనే కొడవలిపెట్టి కోయును.'' అని చెప్పెను.
''దేవుని రాజ్యమునెట్లు పోల్చెదము. ఏ ఉపమానముతో దానిని వర్ణించెదము?
"దేవుని రాజ్యము ఆవగింజను పోలియున్నది. అది భూమిలో విత్తబడినప్పుడు, విత్తనములన్నిటి కంటె చిన్నదే గాని"
"విత్తబడిన తరువాత అది మొలిచి, ఎదిగి కూర మొక్కలన్నిటికన్న పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక దాని కొమ్మలు ఆకాశ పక్షులకు నీడనిచ్చును'' అని చెప్పెను."
"ఈ విధముగా యేసు వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఉపమానములను చెప్పుచు, వారికి వాక్యము బోధించెను."
ఉపమానము లేకుండ వారికి ఏమీ బోధించలేదు. ఆయన ఒంటరిగా వున్నప్పుడు శిష్యులకన్నీ వివరముగా బోధించెను.
ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని శిష్యులతో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన వున్న దోనెలోనే ఆయనను తీసుకొనిపోయిరి.
వారితో కూడ మరి కొన్ని చిన్న దోనెలు వెంట వచ్చెను.
అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యున్న దోనె మీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను.
"ఆయన దోనె వెనుక భాగములో తలదిండు పెట్టుకొని నిద్రించుచుండగ అమరమున శిష్యులు వచ్చి ఆయనను లేపి, బోధకుడా- మేము నశించుపోవు చున్నాము. నీకు చింత లేదా యని అడుగగా,"
"అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి, ''నిశ్శబ్దమై ఊరుకొనుము'' అని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను."
అప్పుడాయన ''మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా''? అని వారితో చెప్పెను.
"ఇదంతా చూచిన వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు, సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి."