:

Mark 7

1

"యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును, శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి,"

2

"ఆయన శిష్యులలో కొందరు, అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి."

3

"పరిసయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు,"

4

"మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్ళు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియును గాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించెడివారు."

5

అప్పుడు పరిసయ్యులును శాస్త్రులును - నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడిగిరి.

6

"అందుకాయన వారితో ఈలాగు చెప్పెను- ''ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని, వారి హృదయము నాకు దూరము ఉన్నది."

7

వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించు దురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే.

8

"మీరు దేవుని ఆజ్ఞను విడిచి పెట్టి, మనుష్యుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు''"

9

"మరియు ఆయన ''మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను విడిచి పెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు"

10

"నీవు నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణ శిక్ష విధింపవలెనని మోషే చెప్పెను గదా?"

11

"అయినను మీరు - ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి,"

12

"నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దైవార్పితమని చెప్పిన యెడల, తన తండ్రి కైనను తల్లికైనను వానిని ఏమియు చేయనీయక,"

13

మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు'' అని చెప్పెను.

14

అప్పుడాయన జనసమూహములను మరల తన యొద్దకు పిలిచి ''మీరందరు నా మాట విని గ్రహించుడి.

15

వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు

16

గాని లోపల నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా జేయును'' అనెను.

17

"ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానము గూర్చి ఆయననడుగగా,"

18

ఆయన వారితో నిట్లనెను- ''మీరును ఇంత అవివేకులైయున్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా ?

19

అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్ధములన్నిటిని పవిత్రపరచును.

20

మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును.

21

"లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలును జారత్వములును, దొంగతనములును,"

22

"నరహత్యలును, వ్యభిచారములును, లోభములును, చెడుతనములును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును."

23

"ఈ చెడ్ఢవన్నియు లోపలి నుండియే బయలు వెళ్ళి, మనుష్యుని అపవిత్రపరచును'' అని ఆయన చెప్పెను."

24

"ఆయన అక్కడ నుండి లేచి, తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి, యొక ఇంట ప్రవేశించి, ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై యుండలేక పోయెను."

25

అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను.

26

ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను.

27

ఆయన ఆమెను చూచి ''పిల్లలు మొదట తృప్తిపొందవలెను; పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు'' అనెను.

28

"అందుకామె- నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడ బల్ల క్రింద నుండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా యని ఆయనతో చెప్పెను."

29

అందుకాయన- ''ఈ మాట చెప్పినందు వలన వెళ్ళుము; దయ్యము నీ కుమార్తెను వదలిపోయినదని'' ఆమెతో చెప్పెను.

30

"ఆమె ఇంటికి వచ్చి, తన కుమార్తె మంచము మీద పండుకొని యుండుటయు, దయ్యము వదలి పోయి యుండుటయు చూచెను."

31

"ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి, సీదోను ద్వారా దెకొపొలి ప్రాంతము మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను."

32

అప్పుడు వారు చెవుడు గల నత్తివాని నొకనిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి.

33

"జనసమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి, ఉమ్మి వేసి, వాని నాలుక ముట్టి,"

34

ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి 'ఎప్పతా' అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడుమని అర్థము.

35

"అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుకనరము సడలి వాడు తేటగా మాటలాడు చుండెను."

36

అప్పుడాయన ''ఇది ఎవనితోను చెప్పవద్దని'' అని కాజ్ఞాపించెను.; అయితే ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు

37

"ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటివాడు వినునట్లుగాను, మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి."

Link: