Matthew 12
ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి.
"పరిసయ్యులది చూచి - విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారు'' అని ఆయనతో చెప్పగా,"
ఆయన వారితో నిట్లనెను - ''తానును తనతో కూడ ఉన్నవారును ఆకలిగొని యుండగా దావీదు చేసినదాని గూర్చి చదువలేదా ?
"అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప, తానైనను తనతో కూడ ఉన్న వారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను."
మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినము ఉల్లంఫిుంచియు నిర్దోషులైయున్నారని మీరు ధర్మశాస్త్రమందు మీరు చదువలేదా?
దేవాలయము కంటె గొప్ప వాడిక్కడ ఉన్నాడ''ని మీతో చెప్పుచున్నాను.
మరియు - కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చక పోదురు.
కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు'' అనెను.
ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు అక్కడ ఊచచెయ్యి గలవాడొకు కనిపించెను.
వారాయన మీద నేరము మోపవలెనని - ''విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా'' యని ఆయన నడిగిరి.
అందుకాయన ''మీలో ఏ మనుష్యునికైనను ఒక గొఱ్ఱె యుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా ?
"గొఱ్ఱె కంటె మనుష్యుడెంతో శ్రేష్టు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే'' అని చెప్పి,"
ఆ మనుష్యునితో - ''నీ చెయ్యి చాపుము'' అనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను. యేసుని సంహరించుటకై ఆలోచన
అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయెను. | బహుజనులాయనను వెంబడింపగా
"ఆయన వారినందరిని స్వస్థపరచి, తనను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను."
ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు ఆలాగు జరిగెను. అదేమనగా -
"''ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను యేర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు ఇతనియందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్య జనులకు న్యాయము కనపరచును."
"అతడు కేకలు వేయడు, అరవడు. తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు."
"నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనుప నారవత్తిని ఆర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయము కనుపరచును. భూలోకమున న్యాయము స్థాపించువారకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. (యెషయా42:1-4)."
ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే.
అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గల వాడాయెను.
అందుకు ప్రజలందరు విస్మయమొంది - ''ఈయన దావీదు కుమారుడు కాడా?'' అని చెప్పుకొనుచుండిరి.
పరిసయ్యులు ఆ మాట విని ''వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కాని మరియొకని వలన కాదు'' అనిరి.
ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను - ''తనకు తానే విరోధముగా వేరు పడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు.
సాతాను సాతానును వెళ్ళగొట్టిన యెడల తనకు తానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?
నేను బయెల్జుబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు ? కాబట్టి వారే మీకు తీర్పరులై యుందురు.
దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది.
ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు ? అట్లు బంధించిన యెడల వాని ఇల్లు దోచుకొనును.
నా పక్షమున నుండని వాడు నాకు విరోధి.; నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టు వాడు.
కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా - మనుష్యులు చేయు ప్రతిపాపమును దూషణయు వారికి క్షమిమింపబడును కాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు.
మనుష్యకుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.
చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదేయని యెంచుడి; లేదా చెట్టు చెడ్ఢదని యెంచి దాని పండును చెడ్ఢదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును.
"సర్పసంతానమా, మీరు చెడ్ఢవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి యుండుదానిని బట్టి నోరు మాట్లాడును గదా?"
సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్ఢ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును.
నేను మీతో చెప్పునదేమనగా - మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసి యుండును.
"నీ మాటలను బట్టి నీతి మంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు."
"అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు - ''బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నాము'' అని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను -"
''వ్యభిచారులైన చెడ్ఢతరము వారు సూచక క్రియనడుగుచున్నారు. ప్రవక్తయైన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు.
యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును.
నీనెవె వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమందు నీనెవె వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటె గొప్పవాడు ఇక్కడున్నాడు.
విమర్శసమయమందు దక్షిణ దేశపు రాణి ఈ తరమువారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను; సొలొమోను కంటె గొప్పవాడు ఇక్కడనున్నాడు.''
''అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును.
"విశ్రాంతి దొరకనందున తాను వదలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్లుదమని కొని వచ్చి, ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి, వెళ్ళి తన కంటె చెడ్ఢవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును; అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును."
అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటె చెడ్ఢదగును. ఆలాగే ఈ దుష్టతరము వారికిని సంభవించును'' అనెను.
ఆయన జన సమూహములతో ఇంకను మాట్లాడు చుండగా - ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాట్లాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి.
అప్పుడొకడు ''ఇదిగో నీతల్లియు నీ సహోదరులును; నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవాని చూచి -
"''నా తల్లి ఎవరు? నా సహోదరులెవరు?'' అని చెప్పి, తన శిష్యులవైపు చెయ్యి చాపి -"
"ఇదిగో నా తల్లియు, నా సహోదరులును"
"పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు'' అనెను."