:

Matthew 11

1

యేసు తన పండ్రెండుమంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను.

2

క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని - ''రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా ?''

3

అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను.

4

"యేసు వారిని చూచి - ''మీరు వెళ్ళి విన్న వాటిని, కన్న వాటిని యోహానుకు తెలుపుడి."

5

"గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్టురోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది."

6

మరియు నా విషయమై అభ్యంతరపనివాడు ధన్యుడు'' అని ఉత్తరమిచ్చెను. యోహానుకంటే గొప్పవాడు పుట్టలేదు.

7

వారు వెళ్ళిపోవు చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను - ''మీరేమి చూచుటకు అరణ్యములలోనికి వెళ్ళితిరి ? గాలికి కదలాడుచున్న రెల్లునా ? మరి ఏమి చూడ వెళ్ళితిరి ?

8

సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా ? సన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో ఉందురు గదా?

9

మరి ఏమి చూడ వెళ్ళితిరి ? ప్రవక్తనా ? అవును గాని ప్రవక్త కంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను''

10

"''నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును'' (మలాకీ3:1) అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను."

11

స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైనవాడు అతని కంటె గొప్పవాడు.

12

బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది; బలాత్కారులు దానిని ఆక్రమించు కొనుచున్నారు.

13

యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచు వచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను.

14

ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా ఇతడే.

15

వినుటకు చెవులు గలవాడు వినును గాక! ఈ తరము వారిని దేనితో పొల్చుదును ?

16

''ఈ తరము వారిని దేనితో పోల్చుదును ? సంత వీధులలో కూర్చొనియుండి

17

మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నాట్య మాడ రైతిరి; ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపు లాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.

18

యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక | వీడు దయ్యము పట్టినవాడని వారనుచున్నారు.

19

"మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక వీడు తిండిపోతును, మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను (పిల్లలను) బట్టి తీర్పు పొందును'' అనెను."

20

పిమ్మట ఏయే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసేనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందక పోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను-

21

"''అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసికొని మారుమనస్సు పొందియుందురు."

22

విమర్శదినమందు మీ గతి కంటె తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను'' అనెను.

23

"కపెర్నహోమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటి వరకు నిలిచియుండును."

24

విమర్శ దినమందు నీ గతికంటే సొదొమ దేశపు వారిగతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.

25

"ఆ సమయమున యేసు చెప్పిన దేమనగా - ''తండ్రీ, ఆకాశమునకును, భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును, వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను."

26

"అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను."

27

"సమస్తమును నా తండ్రి చేత నా కప్పగింపబడినది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు; కుమారుడుగాక, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాక మరియెవడును తండ్రి నెరుగడు."

28

"ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును."

29

నేను స్వాతికుడను దీనమనస్సు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

30

ఏలయనగా నా కాడి సుళువు గాను నా భారము తేలికగాను ఉన్నవి.''

Link: