Matthew 15
ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులును పరిసయ్యులును యేసు నొద్దకు వచ్చి -
"''నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందునిమిత్తము పెద్దల పారంపరాచార్యమును అతిక్రమించుచున్నారు'' అని అడిగిరి."
అందుకాయన - ''మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు ?
"తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను."
మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినయెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర లేదని చెప్పుచున్నారు.
మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.
"వేషధారులారా, ''ఈ ప్రజలు నోటి మాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని"
తమ హృదయమును నాకు దూరముగా చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి'' (యెషయా29:13)
అని మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియేనని వారితో చెప్పి
జనసమూహములను పిలిచి - ''మీరు విని గ్రహించుడి.
నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోటి నుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచును'' అని వారితో చెప్పెను.
"అంతట ఆయన శిష్యులు వచ్చి, ''పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడిరని నీకు తెలియునా'' అని ఆయనను అడుగగా,"
ఆయన - ''పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును.
వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డి వారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా'' అనెను.
"అందుకు పేతురు- ''ఈ ఉపమాన భావము మాకు తెలుపుము'' అని ఆయనను అడుగగా,"
ఆయన - ''మీరును ఇంతవరకు అవివేకులై యున్నారా?
"నోటిలోనికి పోవునదంతయు కడుపులోనికి పోయి బహిర్భూమిలో విడవబడును, గాని"
నోటిలో నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా?
"దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధసాక్ష్యములు, దేవదూషణములు అన్నియు హృదయములో నుండియే వచ్చును."
ఇవే మనుష్యులను అపవిత్ర పరచును'' అని చెప్పెను. కాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్ర పరచదని చెప్పెను.
యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా - ఇదిగో ఆ ప్రాంతము నుండి ఒక కనాను స్త్రీ వచ్చి -
"''ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధ పడుచున్నద''ని కేకలు వేసెను."
"అందుకాయన ఆమెతో ఒక మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి - ''ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమ''ని ఆయనను వేడుకొనగా,"
ఆయన - ''ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు''అనెను.
"అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి -''ప్రభువా, నాకు సహాయము చేయుము'' అని అడిగెను."
"అందుకాయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా,"
"ఆమె - ''నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడ తమ యజమానుల బల్ల మీదనుండి పడు ముక్కలను తినును గదా'' అని చెప్పెను."
"అందుకాయన - ''అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్లే జరుగునుగాక'' అని ఆమెతో చెప్పెను. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను."
"యేసు అక్కడ నుండి వెళ్ళి, గలిలయ సముద్రతీరమునకు వచ్చి, కొండెక్కి అక్కడ కూర్చొని యుండగా,"
"బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు. అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను."
"మూగవారు మాట్లాడుట, అంగహీనులు బాగుపుట, కుంటివారు నడచుట, గ్రుడ్డివారు చూచుటయును చూచి జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి."
"అంతట యేసు తన శిష్యులను పిలిచి - ''ఈ ప్రజలు నేటికి మూడు దినముల నుండి నాయొద్ద నున్నారు. వారికి తినుట కేమియు లేదు, గనుక వారి మీద కనికర పడుచున్నాను; వారు మార్గములో మూర్చ పోవుదురేమోనని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదు'' అని వారితో చెప్పగా,"
ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మన కెక్కడనుండి వచ్చును'' అని ఆయనతో అనిరి.
"యేసు - ''మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి?'' అని వారిని అడుగగా, వారు - ''ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలున్న''వని చెప్పగా,"
"ఆయన ''నేల మీద కూర్చుండు''డని జనసమూహముల కాజ్ఞాపించి,"
"ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి వాటిని విరిచి తన శిష్యుల కీయగా, వారు జనసమూహములకు వడ్డించిరి."
వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి.
స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేల మంది పురుషులు.
జనసమూహములను పంపివేసిన తరువాత ఆయన దోనె యెక్కి మగదాను ప్రాంతములకు వెళ్ళెను.