Matthew 16
అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయననడుగగా - ఆయన వారితో
"''సాయంకాలమున, ఆకాశము ఎర్రగా నున్నది గనుక వర్షము కురియదనియు,"
ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బులతోను నున్నది గనుక నేడు గాలి వాన వచ్చునని మీరు చెప్పుదురు గదా? మీరు ఆకాశ వైఖరి నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు.
"వ్యభిచారులైన చెడ్ఢతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు, అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారి కనుగ్రహింపబడదు'' అని వారితో చెప్పి వారిని విడచి వెళ్ళిపోయెను."
ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుకొనుట మరచిపోయిరి.
"అప్పుడు యేసు వారితో ''చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా నుండుడి'' అని చెప్పెను."
కాగా వారు - రొట్టెలు తేని కారణముగా యేసు వారికి ఈ మాటలు చెప్పెననుకొని తమలో తామనుకొనుచుండిరి.
యేసు అది యెరిగి - ''అల్ప విశ్వాసులారా - మన వద్ద రొట్టెలు లేవని మీలో మీ రెందుకు ఆలోచించు కొనుచున్నారు ?
మీరింకనూ గ్రహింప లేదా ? ఐదు రొట్టెలు అయిదువేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరి ?
ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అదియును మీకు జ్ఞాపకము లేదా ?
"నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు ? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్తపడుడి'' అని చెప్పెను"
అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి.
"యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చి, ''మనుష్య కుమారుడెవరని ప్రజలు చెప్పుకొనుచున్నారు'' అని తన శిష్యులనడుగగా,"
"వారు - కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా లేక ప్రవక్తలలో నొక నియు చెప్పుకొను చున్నారనిరి."
"అందుకాయన - ''మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారు'' అని అడుగగా,"
సీమోను పేతురు - ''నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు'' అని చెప్పెను.
"అందుకాయన - ''సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరచెనే కాని నరులు నీకు బయలు పరచలేదు."
మరియు నీవు పేతురు (రాయి) వు; ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోకపు ద్వారములు దాని యెదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను.
పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చెదను; నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును; భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోక మందును విప్పబడును'' అని అతనితో చెప్పెను.
అటుపిమ్మట తాను క్రీస్తునన్న విషయము ఎవరితోను చెప్పవద్దని తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.
"అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా,"
"పేతురు ఆయన చేయి పట్టుకొని - ''ప్రభువా, అది నీకు దూరమగు గాక, అది నీ కెన్నడును కలుగదు'' అని ఆయనను గద్దింప సాగెను."
"అయితే ఆయన పేతురు వైపు తిరిగి - ''సాతానా, నా వెనుకకు పొమ్ము: నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావు'' అని పేతురుతో చెప్పెను."
"అప్పుడు యేసు తన శిష్యులను చూచి - ''ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువ నెత్తుకొని నన్ను వెంబడింపవలెను."
"తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును."
ఒక మనుష్యుడు లోక మంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనిన యెడల అతని కేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు?
"మనుష్య కుమారుడు, తన తండ్రి మహిమ గలవాడై, తన దూతలతో కూడ రాబోవు చున్నాడు. అప్పుడాయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును."
ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను.