Matthew 20
యేసు వారికి తిరిగి బోధింప సాగెను. ఎలాగనగా ''పరలోక రాజ్యము ఒక ద్రాక్ష తోట యజమానుని పోలియున్నది. అతడు తన తోటలో కూలికి పనివారిని పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి
దినమునకు ఒక దేనారమునకు వారితో ఒడబడి వారిని తన తోటకు పంపెను.
"తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటల సమయములో వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరి కొందరిని చూచి,"
"మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని చెప్పగా వారును వెళ్ళిరి."
"దాదాపు పన్నెండు గంటలకును, మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి ఆలాగే చేసెను."
"తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి, మరి కొందరు నిలిచి యుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారి నడుగగా"
వారు - మమ్ములనెవరును కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు - మీరును నా ద్రాక్ష తోటకు వెళ్ళుడనెను.
సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చినవారి నుండి మొదట వచ్చిన వారందరికి కూలి నిమ్మనెను.
దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసికొనిరి.
మొదట వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకొనిరి గాని వారికిని ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను.
వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్కొక్క గంట మాత్రమే పని చేసినను
పగలంతయు కష్టపడి ఎండ దెబ్బను సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యజమాని మీద సణుగుకొనిరి.
"అందుకతడు వారిలో ఒకనినుద్దేశించి - ''స్నేహితుడా, నేను నీకు అన్యాయముచేయలేదే; నీవు నా యొద్ద ఒక దేనారమునకు పనిచేయుటకు ఒప్పుకొన లేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము,"
నీ కిచ్చినటులే కడపటి వానికిచ్చుటకునూ నాకిష్టమైనది.
నా సొంత సొమ్ముతో నాకిష్టము వచ్చునట్లు చేయుట న్యాయము కాదా ? నేను మంచి వాడనైనందున నీకు కడుపు మంటగా నున్నదా ? అని చెప్పెను.
"ఈ ప్రకారమే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటి వారగుదురు'' అని చెప్పెను."
యేసు యెరూషలేమునకు వెళ్ళనైయున్నప్పుడు తన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా పిలిచి వారితో - ''మనము యెరూషలేముకు వెళ్ళుచున్నాము.
"అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి,"
"ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును, అన్యజనులకు ఆయనను అప్పగింతురు. ఆయన మూడవ దినమున మరలా లేచును''. అని చెప్పెను."
"అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో కలసి ఆయన యొద్దకు వచ్చి, మోకరిల్లి ఒక ఉపకారము చేయమని కోరగా"
యేసు - ''నీవేమి కోరుచున్నావు?'' అని అడిగెను. అందుకామె - ''నీరాజ్యములో నా ఇరువురి కుమారులలో నొకడు నీకుడివైపునను మరి యొకడు నీ యెడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము'' అనెను.
"అందుకు యేసు - ''మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నె లోనిది మీరు త్రాగగలరా?'' అని అడుగగా, వారు మేము త్రాగ గలమనిరి."
ఆయన ''మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా యెడమవైపునను కూర్చుండ నిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకును'' అని చెప్పెను.
తక్కిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి.
"యేసు వారిని తన యొద్దకు పిలిచి, ''అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును."
మీలో అలాగుండ కూడదు. మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను.
మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను.
"అలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను'' అని చెప్పెను."
వారు యెరికో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా బహుజన సమూహములు ఆయన వెంటనే వెళ్ళెను.
"అచ్చట దారి ప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు, యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని - ''ప్రభువా, దావీదు కుమారుడా మమ్మును కరుణింపుము'' అని కేకలు వేసిరి."
"ఊరకుండుడని అచ్చటి జనులు గద్దించిరి గాని వారు బిగ్గరగా - ''ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మును కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి."
"యేసు, నిలిచి, వారిని పిలిచి - ''నేను మీకేమి చేయగోరుచున్నారు'' అని వారి నడుగగా,"
"వారు ''ప్రభువా, మా కన్నులు తెరవవలెన''నిరి."
యేసు వారిపై కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి.