:

Matthew 25

1

'పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది.

2

వీరిలో ఐదుగురు బుద్ధిగలవారు. వారు తమ దివిటీలను పట్టుకొని వారితో సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి.

3

మిగిలిన అయిదుగురు బుద్ధిలేని కన్యకలు -

4

తమ దివిటీలు పట్టుకొని తమతో కూడ నూనె తీసుకొని పోలేదు.

5

పెండ్లి కుమారుని రాక ఆలస్యమైనందున వారందరు కునికి నిద్రించు చుండిరి. |

6

అర్థరాత్రి వేళ ''ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చెను గనుక అతనిని ఎదుర్కొన రండి'' అని కేక వినబడెను.

7

అప్పుడు ఆ కన్యకలందరును లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కాని

8

బుద్ధిలేని ఆ కన్యకలు మిగిలిన వారితో - మా దివిటీలు ఆరిపోవుచున్నవి గావున మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడి అని అడిగిరి.

9

అందుకు బుద్ధికల కన్యకలు - మాకును మీకును ఇది చాలదు మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడి అని చెప్పిరి.

10

"వారు కొనుటకు పోయినప్పుడు పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడియున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి,"

11

"అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి - అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుడి అని అడుగగా"

12

అతడు - నిజముగా నేను మిమ్ములనెరుగను మీరెవరో నాకు తెలియదనెను.

13

ఆ దినమైనను ఆ ఘడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి''.

14

"''పరలోకరాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై, తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించి నట్లుండును."

15

"అతడు తన దాసులను పిలిచి ఒకనికి ఐదు తలాంతులు, ఒకనికి రెండు, మరియొకనికి ఒకటి ఎవరి సామర్థ్యము కొలది వారికి ఇచ్చి దేశాంతరము వెళ్ళెను."

16

ఐదు తలాంతులు తీసుకొనిన దాసుడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరియొక అయిదు తలాంతులు సంపాదించెను.

17

ఆలాగుననే రెండు తీసుకొనినవాడు మరి రెండు సంపాదించెను.

18

అయితే ఒక తలాంతు తీసుకొనినవాడు వెళ్లి దానిని భూమిలో దాచిపెట్టెను.

19

బహుకాలమైన తరువాత ఆ యజమానుడు తిరిగివచ్చి దాసుల యొద్ద లెక్కచూచుకొనెను.

20

"అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనిన దాసుడు మరి ఐదు తలాంతులు తెచ్చి - అయ్యా, నీవు నాకు ఐదు తలాంతులిచ్చితివి. వాటితో మరియొక ఐదు తలాంతులు సంపాదించితిని."

21

"అతని యజమానుడు - భళా నమ్మకమైన మంచి దాసుడ, నీవు ఈ చిన్న విషయములో నమ్మకముగా నుంటివి కనుక నిన్ను అనేక వాటిపై నియమించెదను. నీ యజమాని సంతోషములో పాలుపొంద (ప్రవేశింపు) మనెను."

22

"ఆలాగే రెండు తలాంతులు తీసుకొనినవాడు తెచ్చి - అయ్యా, నీవు నాకు రెండు తలాంతులిచ్చితివి అవిగాక నేను మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను."

23

"అందుకు యజమానుడు - భళా నమ్మకమైన మంచి దాసుడ, నీవు ఈ కొంచెములో నమ్మకముగా నుంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమాని సంతోషములో పాలుపొందు (ప్రవేశింపు) మనెను."

24

"తరువాత ఒక తలాంతు తీసుకొనినవాడును వచ్చి - అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును చల్లని చోట పంట కూర్చు కొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును."

25

గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని. ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పెను.

26

"అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్ఢ దాసుడ, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంటకూర్చుకొను వాడనని నీకు తెలియునా ?"

27

అట్లయితే నీవు నా సొమ్మును వడ్డి వ్యాపారస్థులయొద్ద పెట్టనుంటివి. నేను వచ్చి వడ్డి తో కూడ కలిపి నా సొమ్ము తీసుకొనుయుందునే అని చెప్పి

28

ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి పదితలాంతులున్న వానికీయుడి.

29

కలిగిన ప్రతివానికియ్యబడును. అతనికి సమృద్ధి కలుగును; లేనివాని యొద్ద నుండి అతనికి కలిగినదియు తీసివేయబడును.

30

మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపలి చీకటి లోనికి త్రోసి వేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.''

31

''తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండును.

32

అప్పుడు సమస్త జనములు ఆయన యెదుట పోగుచేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొఱ్ఱెలను వేరు పరచునట్లు ఆయన వారిని వేరుపరచి

33

తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.

34

"అప్పుడు రాజు తన కుడివైపు నున్న వారిని చూచి - నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి."

35

"నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి, పరదేశినైయుంటిని మీరు నన్ను చేర్చుకొంటిరి."

36

"దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో నుంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును."

37

"అందుకు నీతిమంతులు - ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకు ఆహార మిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి ?"

38

ఎప్పుడు నీవు పరదేశివిగా ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి. దిగంబరివైయుండుటచూచి బట్టలిచ్చితిమి.

39

ఎప్పుడు రోగివై యుండుట యైనను చెరసాలలో నుండుటనైనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.

40

అందుకు రాజు - మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరుచేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.

41

"అప్పుడాయన ఎడమవైపు ఉండువారిని చూచి - ''శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి (సాతానుకు)ను వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి."

42

"నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహమీయలేదు,"

43

"పరదేశినైయుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై యుంటిని మీరు నాకు బట్టలీయలేదు రోగినై చెరసాలలో నుంటిని మీరు నన్ను చూడ రాలేదని చెప్పును."

44

"అందుకు వారును - ''ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి గొని యుండుటయైనను, దప్పిగొని యుండుటయైనను, పరదేశివైయుండుటయును, దిగంబరివై యుండుటను, రోగివై యుండుటను, చెరసాలలో నుండుటయును చూచి నీకు ఉపచారము చేయకపోతిమ''ని ఆయననను అడిగెదరు."

45

అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.

46

"వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు.''"

Link: