:

Matthew 24

1

యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్చుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయన దృష్టికి తెచ్చిరి.

2

అప్పుడాయన -''మీరివన్నియు చూచుచున్నారు గదా; రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను.

3

"యేసు ఒలీవ చెట్ల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయన యొద్దకు ఏకాంతముగా వచ్చి -''ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకకును యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుము'' అని అడుగగా,"

4

యేసు వారితో ఇట్లనెను - ''ఎవడును మిమ్మును మోసము చేయకుండ చూచుకొనుడి.

5

అనేకులు నా పేరటవచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు.

6

మరియు యుద్ధములను గూర్చియు యుద్ధముల సమాచారము గూర్చియు మీరు వినినప్పుడు కలవరపవద్దు. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.

7

"జనముల మీదికి జనమును, రాజ్యముమీదికి రాజ్యమును లేచును."

8

అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.

9

అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలుచేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు.

10

అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకరినొకరు ద్వేషించు కొనెదరు.

11

అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు.

12

అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును.

13

అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును.

14

మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును.

15

కాబట్టి ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన - నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే - చదువు వాడు గ్రహించును గాక -

16

యూదయలో నుండువారు కొండలకు పారిపోవలెను.

17

మిద్దె మీదనున్నవాడు తన యింటిలోనుండి ఏమైనను తీసికొని పోవుటకు దిగకూడదు.

18

పొలములో నున్నవాడు తన బట్టలు తీసుకొనిపోవుటకు యింటికి రాకూడదు.

19

"అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ."

20

"అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను, విశ్రాంతి దినమందైనను సంభవింపకుండ వలెనని ప్రార్థించుడి."

21

"లోకారంభమునుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు."

22

ఆ దినములు తక్కువ చేయబడకపోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.

23

"ఆ కాలమున ఎవడైనను - ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు, అక్కడ యున్నాడు అని చెప్పిన యెడల నమ్మకుడి."

24

అబద్ధపు క్రీస్తులును అబద్దపు ప్రవక్తలును వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచకక్రియలను మహత్కార్యములను కనపరచెదరు.

25

ఇదిగో నేను మీకు ముందుగా చెప్పుచున్నాను.

26

కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములోనున్నాడని మీతో చెప్పినను మీరు వెళ్ళకుడి. ఇదిగో లోపలి గదిలోనున్నాడని చెప్పినను నమ్మకుడి.

27

మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకయు నుండును.

28

పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవును.

29

ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. చంద్రుడు కాంతినియ్యడు. ఆకాశమునుండి నక్షత్రములు రాలును. ఆకాశమందలి శక్తులు కదలింపబడును.

30

"అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను, మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు."

31

మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశముయొక్క ఈ చివరనుండి ఆ చివర వరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.

32

అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి - అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంత కాలము ఇక సమీపముగా ఉన్నదని మీకు తెలియును.

33

"ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి."

34

ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

35

"ఆకాశమును, భూమియును గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు''"

36

"''అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని, ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు."

37

నోవహు దినములు ఎట్లుండెనో మనుష్య కుమారుని రాకను ఆలాగుననే నుండును.

38

"జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, వారు తినుచు, త్రాగుచూ, పెండ్లి చేసికొనుచు, పెండ్లి కిచ్చుచునుండి,"

39

జల ప్రళయము వచ్చి అందరికిని కొట్టుకొని పోవువరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్యకుమారుని రాక యుండును.

40

"ఆ కాలమున యిద్దరు పొలములో ఉందురు ఒకడు తీసికొనిపోబడును, మరియొకడు విడచిపెట్టబడును."

41

"ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు. వారిలో ఒక స్త్రీ తీసికొని పోబడును, మరియొక స్త్రీ విడిచి పెట్టబడును."

42

కావున ఏ దినము మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.

43

ఏ జామున దొంగ వచ్చునో యింటి యజమానునికి తెలిసిన యెడల అతడు మెలకువగా నుండి తన యింటికి కన్నము వేయనీయడని మీకు తెలియును.

44

మీరనుకొనని ఘడియలో మనుష్య కుమారుడు వచ్చును. గనుక మీరును సిద్ధముగా నుండుడి.

45

యజమానుడు తన యింటివారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు?

46

యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు బుద్ధిగా తనకు ఏర్పాటు చేసిన పనిని నిర్వర్తించునో అట్టి దాసుడు ధన్యుడు.

47

యజమాని తన యావదాస్తి మీద వానిని అధికారిగా నియమించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

48

"అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమాని ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని,"

49

"తన తోటి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో తినుచు, త్రాగుచు నుంటె"

50

"ఆ దాసుడు కనిపెట్టని దినములలోను, వాడనుకొనని ఘడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియమించును."

51

అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును''

Link: