Matthew 27
"ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులును, ప్రజల పెద్దలందరును, యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి;"
ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి. యూదా ఉరి వేసుకొనుట
అప్పుడాయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపి ఆ ముప్పది వెండి నాణెములు ప్రధానయాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి -
"నేను నిరపరాధి (నీతిమంతుని) రక్తమును అప్పగించి పాపము చేసితిని అని చెప్పెను. అందుకు వారు - దానితో మాకేమి పని ? నీవే చూచుకొనుమని చెప్పగా,"
అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసిపోయి ఉరిపెట్టుకొనెను.
ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని - ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి.
కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి;
అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలము అనబడుచున్నది.
"అప్పుడు - ''విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలులో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన ముప్పది వెండినాణెములు తీసుకొని"
ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి'' అని ప్రవక్తయైన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను.
"యేసు అధిపతి యెదుట నిలిచెను, అప్పుడు అధిపతి - ''యూదుల రాజువు నీవేనా ?'' ఆని ఆయననడుగగా, యేసు అతనిని చూచి - ''నీవన్నట్టే'' అనెను."
ప్రధాన యాజకులును పెద్దలును ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.
కాబట్టి పిలాతు - ''నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా ?'' అని ఆయనను అడిగెను.
అయితే ఆయన ఒక మాట కైనను ఉత్తర మీయలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
జనులు కోరుకొనిన యొక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.
ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధమైన ఖైదీ చెరసాలలో నుండెను.
కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు
- నేనెవరిని విడుదలచేయవలెను మీరు కోరుచున్నారు? బరబ్బనా? లేక క్రీస్తనబడిన యేసునా ?'' అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు యెరిగి యుండెను.
"అతడు న్యాయపీఠము మీద కూర్చుండి యున్నప్పుడు, అతని భార్య - నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయనను గూర్చి ఈ ప్రొద్దు కలలో నేను మిక్కిలి బాధపడితిని అని అతని యొద్దకు వర్తమానము పంపెను."
"ప్రధాన యాజకులును, పెద్దలును బరబ్బను విడిపించుమని అడుగుటకును యేసుని సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి."
అధిపతి - ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? అని వారి నడుగగా వారు - బరబ్బానే అనిరి.
అందుకు పిలాతు - ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతును? అని వారి నడుగగా - సిలువ వేయుమని అందరును చెప్పిరి.
. అధిపతి - ఎందుకు ? ఇతడు ఏ దుష్కార్యముచేసెను? అని అడుగగా వారు సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి.
"పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమి ఏమియు లేదని గ్రహించి నీళ్ళు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని - ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను."
అందుకు ప్రజలందరు - వాని రక్తము మామీదను మా పిల్లల మీదను నుండుగాక అనిరి.
"అప్పుడతడు వారు కోరినట్లు బరబ్బను విడుదలచేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను."
అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికారమందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరిని సమకూర్చిరి.
వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి
"ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి, ఆయన యెదుట మోకాళ్ళాని - యూదుల రాజా, నీకు శుభము అని ఆయనను అపహసించి."
"ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తలమీద కొట్టిరి."
ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము లాయనకు తొడిగించి సిలువ వేయుట కాయనను తీసుకొనిపోయిరి.
వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతయు చేసిరి.
"వారు కపాల స్థలమను అర్థమిచ్చు గొల్గతా అనబడిన చోటుకు వచ్చి,"
చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.
వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొనిరి.
అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి.
ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలపై నుంచిరి.
. మరియు కుడి వైపున ఒకడును ఎడమవైపున మరొకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడ సిలువ వేసిరి.
ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తలలూపుచూ-
"దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ, నిన్ను నీవే రక్షించుకొనుము."
నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుము అని చెప్పుచు ఆయనను దూషించిరి.
"ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్నుతానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజు కదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగినయెడల వాని నమ్ముదుము."
"వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయన కిష్టుడైతే దేవుడిప్పుడు వానిని తప్పించును అని చెప్పిరి."
ఆయనతో కూడ సిలువ వేయబడిన బందిపోటు దొంగలును ఆలాగే ఆయనను నిందించిరి.
"మధ్యాహ్నము పన్నెండు గంటలు మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతట చీకటి కమ్మెను. ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ''ఏలీ, ఏలీ, లామా సబక్తానీ'' అని బిగ్గరగా కేకవేసెను."
"ఆ మాటకు నాదేవా, నాదేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము."
అక్కడ నిలిచి యున్నవారిలో కొందరా మాట విని - ఇతడు ఏలీయాను పిలచుచున్నాడనిరి.
"వెంటనే వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి స్పంజీ తీసుకొని చిరకాలో దానిని ముంచి, రెల్లునకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను."
"తక్కినవారు, ఊరకుండుడి, ఏలీయా అతనిని రక్షింపవచ్చునేమో చూతము అనిరి. మరి యొకడు ఈటె ఎత్తికొని ఆయన ప్రక్కన పొడువగా రక్తమును, నీళ్ళును కారెను."
యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడచెను.
"అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బ్రద్ధలాయెను"
"సమాధులు తెరువబడెను, నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను."
వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో అనేకులకు కనపిరి.
"శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలియున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి - నిజముగా ఈయన దేవుని కుమారుడే అని చెప్పుకొనిరి."
యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరముగా నుండి చూచుచుండిరి.
వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే వారి తల్లియైన మరియయు జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి.
యేసు శిష్యుడుగా నున్న అరిమతయి యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి
పిలాతు నొద్దకు వెళ్ళి - యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతని కప్పగించనాజ్ఞాపించెను.
యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి
తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాతిని పొర్లించి వెళ్ళిపోయెను.
మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చొని యుండిరి. సమాధిని భద్రము చేయుట
మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులును పరిసయ్యులును పిలాతునొద్దకు వచ్చి -
"అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు - మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పిన మాట మాకు జ్ఞాపకము ఉన్నది."
"కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి, ఆయన మృతులలో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటె కడపటి వంచన మరి చెడ్ఢదై ఉండును అని చెప్పిరి."
అందుకు పిలాతు- కావలి వారున్నారు గదా? మీరు వెళ్ళి మీ చేతనైనంతమట్టుకు సమాధిని భద్రము చేయుడి అని వారితో చెప్పెను.
"వారు వెళ్ళి కావలి వారిని కూడ వారితో ఉంచుకొని, రాతికి ముద్రవేసి సమాధిని భద్రము చేసిరి."