Matthew 28
విశ్రాంతిదినము గచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.
అంతలో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుని యుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను.
"ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను."
అతనికి భయపడి కావలివారు వణకుచు చచ్చినవారివలె పడియుండిరి.
"దేవదూత ఆ స్త్రీలను చూచి - మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును."
"ఆయన ఇక్కడలేడు. తాను ముందు చెప్పినట్లే ఆయన లేచియున్నాడు. రండి ప్రభువు పండుకొనిన స్థలమును చూచి,"
త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచెనని ఆయన శిష్యులకు తెలియజేయుడి. మీకన్నముందుగా ఆయన గలిలయకు వెళ్ళుచున్నాడు కనుక మీరక్కడ ఆయనను చూతురు అనెను.
"వారు భయముతోను, మహా ఆనందముతోను త్వరగా వెళ్ళి శిష్యులకు ఆ మాట చెప్పుదమని సమాధి దగ్గర నుండి పరుగెత్తుచుండగా"
"యేసు వారి నెదుర్కొని, ''మీకు శుభము'' అని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మ్రొక్కగా,"
యేసు - ''భయపడకుడి; మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారు నన్ను అక్కడ చూతురనియు వారికి తెలుపుడి'' అని చెప్పెను.
వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నియు ప్రధాన యాజకులకు తెల్పిరి.
"అప్పుడు వారు పెద్దలతో కూడి ఆలోచనచేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి,"
"అతని శిష్యులు రాత్రివేళ వచ్చి, మేము నిదురించు చుండగా అతనిని ఎత్తికొని పోయిరని మీరు చెప్పుడి."
ఈ విషయము గనుక అధికారుల దృష్టికి వెళ్ళినట్ల్షెతే దానిని మేము సమ్మతి పరిచి మీకేమియు తొందర కలుగకుండ చేసెదమని వారితో చెప్పిరి.
అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకును ప్రసిద్ధమైయున్నది.
పదకొండుగురు శిష్యులు యేసు చెప్పిన విధముగా గలిలయలోని కొండమీదికి వెళ్ళిరి.
"వారు ఆయనను చూచి మ్రొక్కిరి, గాని వారిలో కొందరు సందేహించిరి."
"అయితే యేసు వారియొద్దకు వచ్చి ''పరలోకమందును, భూమిమీదను నాకు సర్వాధికారముఇయ్యబడియున్నది."
"కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి; తండ్రి యొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మమిచ్చుచు"
నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగసమాప్తి వరకు అన్నివేళలా నేను మీతో కూడ ఉన్నాను'' అని వారితో చెప్పెను.