:

Matthew 6

1

మనుష్యులకు కనబడవలెనని వారి యెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపుడుడి; లేనియెడల పరలోక మందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు.

2

"కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను."

3

"నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకుండవలెను"

4

అట్లయితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. ప్రార్థన రహస్యముగా చేయవలెను

5

మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారులవలె నుండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజమందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారి కిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

6

"నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును."

7

మరియు మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు.

8

మీరు వారివలె ఉండకుడి. మీరు తండ్రిని అడుగకమునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును.

9

కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి-

10

"''పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక."

11

మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము.

12

మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.

13

మమ్మును శోధనలోనికి తేక దుష్టుని (కీడు) నుండి మమ్మును తప్పించుము. రాజ్యమును బలము మహిమయు నీవైయున్నవి. ఆమేన్''

14

''మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.

15

మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు''

16

''మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

17

"ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము."

18

అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును''

19

''భూమిమీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును; దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు.

20

పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి; అక్కడ చిమ్మెట యైనను తుప్ష్పెనను దానిని తినివేయదు. దొంగలు కన్నము వేసి దానిని దొంగిలించరు.

21

నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయ ముండును.

22

దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా నుండిన. యెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.

23

నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమైయుండును. నీలో నున్న వెలుగు చీకటియై యుండినయెడల ఆ చీకటి ఎంతో గొప్పది.

24

ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరు. అతడు ఒకనిని ద్వేషించి మరియొకనిని ప్రేమించును లేదా యొకని పక్షముగా నుండి మరియొకనిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు''

25

"అందువలన నేను మీతో చెప్పునదేమనగా - ''ఏమి తిందుమో ఏమి త్రాగుదు మోయని మీ ప్రాణమును గూర్చియైనను ఏమి ధరించు కొందుమో'' అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారము కంటె ప్రాణమును, వస్త్రము కంటె దేహమును గొప్పవి కావా ?"

26

"ఆకాశ పక్షులను చూడుడి - అవి విత్తవు, కోయవు కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటి కంటే బహు శ్రేష్టులు కారా ?"

27

మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసికొనగలడు ?

28

"వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల? అడవి పువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపవు, ఒడకవు."

29

అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనా అలంకరింపబడలేదు.

30

"నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడులాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా."

31

కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.

32

ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.

33

కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.

34

రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును; ఏనాటి కీడు ఆనాటికి చాలును''

Link: