:

Matthew 5

1

ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చిరి.

2

అప్పుడు ఆయన వారినుద్దేశించి ఈలాగు బోధింపసాగెను.

3

ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

4

దుఃఖపువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

5

సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.

6

నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తి పరచబడుదురు.

7

కనికరము గలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.

8

హృదయశుద్ధి గలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.

9

సమాధాన పరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.

10

నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

11

"నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్ఢమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు;"

12

"సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి."

13

''మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును ? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్క బడుటకే గాని మరి దేనికిని పనికి రాదు.

14

మీరు లోకమునకు వెలుగై యున్నారు; కొండ మీద నుండు పట్టణము మరుగై యుండనేరదు.

15

మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది ఇంట నుండు వారి కందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు.

16

మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి యెదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి''

17

ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.

18

ఆకాశమును భూమియు గతించి పోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దాని నుండి ఒక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

19

"కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడోవాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్ప వాడనబడును."

20

శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.

21

నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడినమాట మీరు విన్నారు గదా?

22

"నేను మీతో చెప్పునదేమనగా - తన సహోదరుని మీద (నిర్నిమిత్తముగా) కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహీ, అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును."

23

కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల

24

"అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచి పెట్టి, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము."

25

"నీ ప్రతివాదితో నీవును త్రోవలో నుండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు."

26

కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

27

వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా

28

నేను మీతో చెప్పునదేమనగా - ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును.

29

నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా?

30

నీ కుడిచెయ్యి నిన్నభ్యంతరపరచిన యెడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా?

31

తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక నివ్వవలెనని చెప్పబడియున్నది గదా;

32

"నేను మీతో చెప్పునదేమనగా - వ్యభిచార కారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడిన దాని పెండ్లువాడు వ్యభిచరించుచున్నాడు."

33

మరియు -నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లించవలెనని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా?

34

నేను మీతో చెప్పునదేమనగా - ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్ధు. అది దేవుని సింహాసనము.

35

"భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము."

36

"నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు."

37

"మీ మాట ఔనంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి (కీడు నుండి) పుట్టునది."

38

"''హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను పంటికి పల్లు, చేతికి చేయి కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు నియమింపవలెను'' నిర్గమ21:23-25) అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా"

39

"నేను మీతో చెప్పునదేమనగా - దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడ త్రిప్పుము."

40

ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరిన యెడల వానికి నీ పై వస్త్రము కూడ ఇచ్చివేయుము.

41

"ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన యెడల, వానితో కూడ రెండు మైళ్ళు వెళ్ళుము."

42

నిన్ను అడుగు వానికిమ్ము. నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.

43

"''నీ పొరుగు వానిని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా?"

44

నేను మీతో చెప్పునదేమనగా - మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి.

45

"ఆయన చెడ్ఢవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు."

46

మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును ? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా?

47

మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా?

48

మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.''

Link: