:

Philippians 1

1

"ఫిలిప్పీలో ఉన్న క్రీస్తుయేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులును క్రీస్తుయేసు దాసులైన పౌలును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది-"

2

మన తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధామును కలుగును గాక.

3

"మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి,"

4

మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.

5

"గనుక మీ అందరి నిమిత్తమును నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థ్ధన చేయుచు,"

6

నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

7

"నా బంధకములయందును, నేను సువార్త పక్షమున వాదించుటయందును దానిని స్థిరపరచుట యందును, మీరందరు ఈ కృపలో నాతో కూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొనియున్నాను. ఇందుచేత మీ అందరిని గూర్చి ఈలాగు తలంచుట నాకు ధర్మమే."

8

క్రీస్తు యేసుయొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి.

9

"మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను, సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు,"

10

"ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై,"

11

క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను.

12

"సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొన గోరుచున్నాను."

13

"ఏలాగనగా, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికిని, తక్కినవారికందరికిని స్పష్ట మాయెను."

14

"మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసముగలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి."

15

"కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరికొందరు మంచి బుద్ధిచేతను క్రీస్తును ప్రకటించుచున్నారు."

16

"వారైతే నా బంధకములతో కూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు;"

17

"వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి యున్నానని యెరిగి, ప్రేమతో ప్రకటించుచున్నారు. క్రీస్తు ప్రకటింపబడుచున్నాడని పౌలు సంతోషము"

18

"అయిన నేమి? మిష చేతనేగాని సత్యముచేతనేగాని ఏవిధముచేతనైనను క్రీస్తు ప్రకటింప బడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును."

19

"మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక ఎప్పటివలెనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావుమూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని."

20

"నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును. జీవించుటయా? బ్రతుకుటయా? ఏది ఉత్తమమైనది ?"

21

"నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము."

22

"అయినను, శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు."

23

"ఈ రెంటి మధ్యను ఇరుకున పడియున్నాను. నేను వెడలిపోయి, క్రీస్తుతో కూడ ఉండవలెనని నాకు ఆశ యున్నది. అది నాకు మరి మేలు."

24

అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమైయున్నది.

25

"మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరలా మీతో కలిసియుండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసుని యందు మీకున్న అతిశయము అధికమగునట్లు,"

26

మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమునుపొందు నిమిత్తము నేనుజీవించి మీ అందరితోను కలిసి యుందునని నాకు తెలియును. ప్రోత్సాహకరమైన హెచ్చరికలు

27

"నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏవిషయములోను ఎదిరించువారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని, నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి."

28

అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలిగెననుటకు సూచనయైయున్నది. ఇది దేవుని వలన కలిగినదే.

29

"ఏలయనగా, మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగియున్నందున"

30

క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకనుగ్రహింపబడెను.

Link: