"మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి, ఏడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనము నందు ఆసీనుడైయుండు వాని కుడిచేత చూచితిని."
2
మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్టుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని.
3
అయితే పరలోకమందుగాని భూమిమీద గాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను.
4
"ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా,"
5
ఆ పెద్దలలో ఒకడు- ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడుముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను.
6
"మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు."
7
ఆయన వచ్చి సింహాసనము నందు ఆసీనుడైయుండు వాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.
8
"ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణెలును, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలును పట్టుకొనియున్న ఆ ఇరువది నలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱె పిల్ల యెదుట సాగిలపడిరి."
9
"ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థ్ధనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితిమి;"
10
గనుక వారు భూలోక మందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు.
11
"మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను."