Acts 13
"అంతియొకలో నున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతో కూడ పెంచబడిన మన యేను, పౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి."
"వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, పరిశుద్ధాత్మ - ''నేను బర్నబాను పౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి'' అని వారితో చెప్పెను."
అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి.
కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి.
వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను.
వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను యొక యూదుని చూచిరి.
"ఇతడు వివేకముగలవాడైన సెర్గిపౌలు అను అధిపతి యొద్ద నుండెను. | అతడు బర్నబాను, పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను."
అయితే ఇలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.
"అందుకు పౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై,"
"అతని తేరి చూచి - సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?"
"ఇదిగో ప్రభువు తన చేయి నీ మీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును, చీకటియు అతని కమ్మెను. గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడపింతురా అని వెదకుచుండెను."
"అంతట ఆ అధిపతి జరిగిన దానిని చూచి, ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను."
"తరువాత పౌలును అతనితో కూడ ఉన్నవారును ఓడయెక్కి పాపునుండి బయలుదేరి పంపూలియాలో ఉన్న పెర్గేకువచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి, యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను."
"అప్పుడు వారు పెర్గే నుండి బయలు దేరి పిసిదియలో నున్న అంతియెకయకు వచ్చి, విశ్రాంతి దినమందు సమాజమందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి."
"ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు- సహోదరులారా, ప్రజలకు మీరేదైన బోధ వాక్యము చెప్పవలెనని యున్నయెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి."
అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను -
"ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజ బలముచేత వారి నక్కడనుండి తీసుకొని వచ్చి,"
ఇంచుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను.
మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచియిచ్చెను.
ఇంచుమించు నాలుగువందల యేబది సంవత్సములు యిట్లు జరిగెను. అటు తరువాత ప్రవక్తయైన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను
"ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా, దేవుడు బెన్యామీను గోత్రీయుడును, కీషు కుమారుడు నైన పౌలును వారికి నలువది యేండ్లవరకు దయచేసెను."
"తరువాత అతనిని తొలగించి, దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన - నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశ్యములన్నియు నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్య మిచ్చెను."
అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను.
ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను.
"యోహాను తన పనిని నెరవేర్చుచుండగా - నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను; ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను."
"సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడియున్నది."
"యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులును అయనైనను ప్రతి విశ్రాంతి దినము చదువబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి."
ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి.
"వారు ఆయనను గూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేర్చిన తరువాత. ఆయనను మ్రానుమీదనుండి దింపి, సమాధిలో పెట్టిరి."
అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.
ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తనతో కూడ వచ్చినవారికి అనేక దినములు కనబడెను; వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్ష్యులై యున్నారు.
"దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్ధానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించు చున్నాము."
"ఆలాగే - ''నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని'' అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది"
"మరియు ''ఇక కుళ్ళు పట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటను బట్టి, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవి'' అని చెప్పెను."
"కాబట్టి వేరొక కీర్తనయందు,- నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు."
"దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,"
తన పితరులయొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళుపట్టలేదు.
"కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,"
మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియుగాక
ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండ చూచుకొనుడి. అదేమనగా -
"ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసెదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను"
"వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా, ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి."
"సమాజ మందిర ములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులును, భక్తిపరులైన యూద మత ప్రవిష్టులును పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాటలాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి."
మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.
"యూదులు జనసమూహములను చూచి, మత్సరముతో నిండుకొని, దూషించుచు, పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి."
"అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి - దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్ళు చున్నాము."
ఏలయనగా - నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా యుంచియున్నానని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.
అన్యజనులును ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.
"ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను గాని,"
"యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి."
వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపి వేసి ఈకొనియకు వచ్చిరి.
అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి.