:

Acts 6

1

ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగుకొనసాగిరి.

2

"అప్పుడు పన్నెండుమంది అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి - మేము దేవుని వాక్యము బోధించుట మాని, బల్లలయొద్ద పరిచర్య చేయుట ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు."

3

"కాబట్టి సహోదరులారా, ఆత్మతోను, జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన ఏడుగురు మనుష్యులను మీలో ఏర్పరచు కొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము."

4

అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి.

5

"ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు అనువారిని ఏర్పరచుకొని,"

6

వారిని అపొస్తలుల యెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి.

7

దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.

8

"స్తెఫను కృపతోను, బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్పసూచక క్రియలను చేయుచుండెను."

9

"అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియ నుండియు ఆసియ నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని"

10

"మాట లాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేక పోయిరి."

11

"అప్పుడు వారు - వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని,"

12

"ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి,"

13

అతనిని పట్టుకొని మహాసభయొద్దకు తీసుకొని పోయి ఈ అబద్దపు సాక్షులను నిలబెట్టిరి. వారు - ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటాలాడుచున్నాడు.

14

"ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడుచెప్పగా మేము వింటిమనిరి."

15

సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.

Link: