Acts 7
ప్రధాన యాజకుడు - ఈ మాటలు నిజమేనా అని అడిగెను.
"అందుకు స్తెఫను చెప్పినదేమనగా - సహోదరులారా, తండ్రీలారా వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో నున్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై -"
"నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను."
అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడనుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడతని తీసుకొని వచ్చెను.
ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను.
"అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదరినియు, ఆ దేశస్తులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోబరచుకొని బాధ పెట్టుదురని చెప్పెను."
మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులై యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను.
"మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని, ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు పన్నెండుమంది గోత్రకర్తలనుకని వారికి సున్నతి చేసిరి."
"ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి,"
దయను జ్ఞానమును ఐగుప్తురాజైన ఫరోయెదుట అతనికి అనుగ్రహించి నందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.
తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరవును బహుశ్రమయును వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను.
"ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అచ్చటికి మొదటిసారి పంపెను."
"వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకొనెను, అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను."
యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను. వారు డెబ్బదియైదురుగురు.
"యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడనుండి షెకెమునకు తేబడి,"
షెకెములోని హామోరు కుమారులయొద్ద అబ్రాహాము వెలయిచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి.
అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధిపొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏల నారంభించెను.
"ఇతడు మన వంశస్థుల యెడల కపటముగా ప్రవర్తించి,"
తమ శిశువులు బ్రతుకకుండ వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధపెట్టెను.
ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచబడెను.
తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను.
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
"అతనికి నలువది యేండ్లు నిండ వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను."
"అప్పుడు వారిలో ఒకడు అన్యాయముననుభవించుట చూచి, వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను."
"తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని, వారు గ్రహింపరైరి."
"మరునాడు ఇద్దరు కొట్లాడుచుండగా అతడు వారిని చూచి - అయ్యలారా, మీరు సహోదరులు మీరెందుకు ఒకరికొకరు అన్యాయము చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధాన పరచచూచెను."
"అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు, మా మీద అధికారిని గాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు?"
నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలచియున్నావా? అని అతనిని త్రోసివేసెను.
మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశియై యుండి అక్కడ యిద్దరు కుమారులను కనెను.
నలువది యేండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను.
"మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి, దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా -"
"నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు."
"అందుకు ప్రభువు - నీ చెప్పులు విడువుము; నీవు నిలుచున్న చోటు పరిశుద్ధమైన భూమి, -"
"ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను."
అధికారిని గాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకుడుగాను నియమించి పంపెను.
"ఇతడు ఐగుప్తులోను ఎర్రసముద్రములోను నలువదియేండ్లు అరణ్యములోను, మహత్కార్యము లను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను."
నావంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే.
సీనాయి పర్వతము మీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు యుండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే.
"ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరినవారై,"
"మాకు ముందు, నడచునట్లు దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశమునుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి."
"ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహామునకు బలినర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి."
"అందుకు దేవుడు వారికి విముఖుడై, ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది. ఇశ్రాయేలు యింటివారలారా, మీరు అరణ్యములో నలువదియేండ్లు బలిపశువులను అర్పణములను నాకు అర్పించితిరా?"
మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి. గనుక బబులోను ఆవలికు మిమ్ములను గొనిపోయెదను.
అతడు చూచిన మాదిరి చొప్పున తాను చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరులయొద్ద నుండెను.
మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసికొనిన వారై దేవుడు తమ యెదుటనుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు యెహోషువతో కూడ ఈ దేశమునకు దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినములవరకు ఉండెను.
అతడు దేవుని దయపొంది యాకోబు యొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను.
అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను; అయినను- ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము
మీరు నా కొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది?
ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు.
అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు.
"ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచ నొల్లని వారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించు చున్నారు."
మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింసక యుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.
దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను.
వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనినిచూచి పండ్లు కొరికిరి.
"అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచి-"
ఆకాశము తెరవబడుటయు మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమును నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.
అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి-
పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు పౌలు అను ఒక యౌవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి.
"ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు - యేసు ప్రభువా, నా యాత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారతనిని రాళ్ళతో కొట్టిరి."
"అతడు మోకాళ్ళాని - ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. పౌలు అతని చావునకు సమ్మతించెను."