:

Luke 10

1

"అటు తరువాత ప్రభువు డెబ్బది మంది ఇతరులను నియమించి, తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటునకును తనకంటె ముందు యిద్దరిద్దరినిగా పంపెను."

2

పంపినపుడు ఆయన వారితో నిట్లనెను- ''కోత విస్తారముగా నున్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోతయజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.

3

మీరు వెళ్ళుడి; తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱె పిల్లలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను.

4

మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు.

5

త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలడుగవద్దు; మీరు ఏ యింట నైనను ప్రవేశించినప్పుడు ఈ యింటికి సమాధానమగు గాక యని మొదట చెప్పుడి.

6

సమాధాన పాత్రుడు అక్కడ నుండిన యెడల మీ సమాధానము అతని మీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగివచ్చును.

7

వారు మీకిచ్చు పదార్ధములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు.

8

"మరియు మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించునప్పుడు, వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి."

9

అందులోనున్న రోగులను స్వస్థపరచుడి - దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి.

10

"మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయిన యెడల,"

11

మీరు దాని వీధులలోనికి పోయి - మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని మీ ఎదుటనే దులిపి వేయు చున్నాము; అయినను దేవుని రాజ్యము సమీపించియున్నదని తెలిసికొనుడని చెప్పుడి.

12

ఆ పట్టణపు గతి కంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ దగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.

13

"అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ కొరకు చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారుమనస్సుపొంది యుందురు."

14

అయినను విమర్శకాలము నందు మీ గతి కంటె తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై యుండును.

15

"ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింప బడెదవా ? నీవు పాతాళము వరకు త్రోసివేయబడి దిగిపోదువు."

16

"మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు, నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అనెను."

17

"ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి - ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా,"

18

ఆయన - ''సాతాను మెరుపువలె ఆకాశము నుండి పుట చూచితిని.

19

పాములను తేళ్ళను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము ననుగ్రహించి యున్నాను; ఏదియు మీ కెంత మాత్రమును హాని చేయదు.

20

అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి యున్నవని సంతోషించుడి'' వారితో చెప్పెను''.

21

"ఆ ఘడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి - ''తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచితివని నిన్ను స్తుతించు చున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను."

22

"సమస్తమును నా తండ్రి చేత నాకు అనుగ్రహింపబడినది; కుమారుడెవరో తండ్రి తప్ప మరెవరును యెరుగరు; తండ్రి ఎవరో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించెనో అతడును తప్ప మరెవరును ఎరుగరు'' అని చెప్పెను."

23

అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి- ''మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యమైనవి;

24

"అనేకమంది ప్రవక్తలును, రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు నుండిరని మీతో చెప్పుచున్నాను'' అని ఏకాంతమందు వారితో అనెను."

25

"ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసును పరీక్షింపజూచి- బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడుగగా,"

26

"ఆయన - ''ధర్మశాస్త్ర మందేమి వ్రాయబడియున్నది ? నీవేమి చదువుచున్నావు''? అని అతనినడుగగా,"

27

"అతడు - 'నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతోను పూర్ణమనస్సుతోను పూర్ణ శక్తి తోను పూర్ణ వివేకముతోను ప్రేమింపవలయుననియు, నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెననియు వ్రాయబడియున్నది'' అని చెప్పెను."

28

అందుకాయన - ''నీవు సరిగా చెప్పితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవు'' అని అతనితో చెప్పెను.

29

"అయితే ఆ బోధకుడు తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, నా పొరుగువాడెవడని యేసును అడిగెను.;"

30

అందుకు యేసు- ''ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ప్రయాణమై వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొన ప్రాణముతో అతని నక్కడ విడిచి పోయిరి.

31

అప్పుడొక యాజకుడు ఆ మార్గము ద్వారా వెళ్ళుట తటస్థించెను. ఆ యాజకుడతనిని చూచి ప్రక్కగా పోయెను.

32

ఆలాగుననే లేవీయుడొకు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను.

33

"అయితే ఒక సమరయుడు ప్రయాణమై ఆ మార్గము ద్వారా పోవుచు అతడు పడియుండుట చూచి,"

34

"అతని దగ్గరకు వచ్చి, అతని మీద జాలిపడి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనము మీద నెక్కించి, ఒక సత్రమునకు తీసుకొనిపోయి అతని పరామర్శించెను."

35

మరుసటి దినము ఆ సత్రపు యజమానికి రెండు దేనారములిచ్చి అతనితో ఇతనిని పరామర్శించుము. నీవింకేమైనను అతని మీద వెచ్చించిన యెడల నేను తిరిగి వచ్చినప్పుడు నీకు దానిని చెల్లించెదనని చెప్పిపోయెను.

36

"కాగా దొంగల చేతికి చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది ? అని యేసు అడుగగా- నతడు, ''అతని మీద జాలి జూపినవాడే'' అని చెప్పెను."

37

అందుకు యేసు- ''నీవును వెళ్ళి ఆలాగు చేయుము'' అని అతనితో చెప్పెను.

38

వారు ప్రయాణమై పోవుచు ఒక గ్రామములో ప్రవేశించిరి. మార్త అనునొక స్త్రీ ఆయనను తన యింటికి ఆహ్వానించెను.

39

ఆమెకు మరియను ఒక సహోదరి యుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను.

40

"మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి - ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు, నా సహోదరి నన్ను విడిచి పెట్టినందుకు నీకు చింత లేదా ? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను."

41

"అందుకు ప్రభువు - ''మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే."

42

మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు'' అని ఆమెతో చెప్పెను.

Link: