:

Mark 2

1

ఆయన కొన్ని దినములైన తరువాత మరల కపెర్నహూముకు వచ్చెను.

2

"ఆయన ఇంట ఉన్నాడని తెలిసి అనేకులు కూడి రాగా అక్కడ చాలినంత స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా,"

3

ఒక పక్షవాయువు గల మనుష్యుని నలుగురు మోసుకుని ఆయన యొద్దకు తీసుకొనివచ్చిరి.

4

చాలామంది కూడియున్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోట పైకప్పులో సందుచేసి పక్షవాయువు గలవాని ఆ సందులో గుండ పరుపుతోనే క్రిందికి దింపిరి.

5

"యేసు వారి విశ్వాసము చూసి - ''కుమారుడా, నీ పాపములు క్షమింపబడినవి'' అని పక్షవాయువు గలవానితో చెప్పెను."

6

"శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని, ఇతడులాగు ఎట్లు చెప్పుచున్నాడు."

7

"ఇది దేవదూషణ కదా, దేవుడొక్కడే తప్ప పాపములు క్షమించగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకొనుచుండిరి."

8

వారీలాగు ఆలోచించుకొనుట యేసు తన ఆత్మలో తెలిసికొని వారితో '' మీ హృదయములలో మీరెందుకీలాగు ఆలోచించుకొను చున్నారు?

9

ఈ పక్షవాయువుగల వానితో నీ పాపములు క్షమించబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా?

10

"అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను'' అని వారితో చెప్పి,"

11

పక్షవాయువు గల వానిని చూచి- ''నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను'' అనెను.

12

వెంటనే అతడు లేచి పరుపెత్తుకొని వారందరి యెదుట నడచుచు పోవగా వారందరు విభ్రాంతినొంది మనము ఇటువంటి కార్యములు ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.

13

ఆయన సముద్ర తీరమున మరల నడచి వెళ్ళుచుండగా జనులందరు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారికి బోధించెను.

14

"ఆయన ఆ మార్గమున వెళ్ళుచు, సుంకపు మెట్టు నొద్ద కూర్చునియున్న అల్ఫయి కుమారుడైన లేవిని చూచి నీవు నన్ను వెంబడింపుమనగా అతడు లేచి ఆయనను వెంబడించెను."

15

అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండియుండిరి. వారిలో చాలామంది ఆయనను వెంబడించువారు.

16

"పరిసయ్యులలో నున్న శాస్త్రులు ఆయన సుంకరు లతోను, పాపులతోను కలసి భుజించుచున్నాడేమని ఆయన శిష్యులతో అడుగగా,"

17

యేసు ఆ మాటలు విని- ''రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు'' అని వారితో చెప్పెను.

18

"ఆ రోజులలో యోహాను శిష్యులును, పరిసయ్యులును ఉపవాసము చేయుచుండెడివారు. వారిలో కొందరాయన దగ్గరకు వచ్చి- యోహాను శిష్యులును,పరిసయ్యుల శిష్యులును ఉపవాసము చేసెదరు గాని నీ శిష్యులు ఉపవాసము ఎందుకు చేయరని అడుగగా,"

19

"యేసు- ''పెండ్లి కుమారుడు తమతో కూడ వున్న కాలమున పెండ్లి యింటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు, గాని"

20

పెండ్లి కుమారుడు వారి యొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేసెదరు.

21

ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన యెడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును. చినుగు మరి ఎక్కువగును.

22

"ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన యెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును. రసమును, తిత్తులను చెడిపోవును. అందుకే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలోనే పోయవలెను'' అని చెప్పెను."

23

ఆయన విశ్రాంతి దినమున పంటచేలలో బడి వెళ్ళుచుండగా మార్గములో శిష్యులు పంట వెన్నులు త్రుంచుచుండిరి.

24

"అందుకు పరిసయ్యులు యేసుతో- విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులేల చేయుచున్నారని యడుగగా,"

25

యేసు వారితో- ''తానును తనతో నున్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెరుగరా?

26

అబ్యాతారు ప్రధాన యాజకుడైయుండగా దైవ మందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో ఉన్నవారికిచ్చెను గదా?'' అని చెప్పెను. మరియు

27

''విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమించబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింప బడలేదు.

28

అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడు'' అని వారితో చెప్పెను.

Link: