:

Matthew 10

1

"ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చెను."

2

"ఆ పన్నెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రెయ, జెబెదయ కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను,"

3

"ఫిలిప్పు, బర్తొలోమయి, తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అనబడు లెబ్బయి"

4

"కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా."

5

"యేసు ఆ పన్నెండు మందిని పంపుచు, వారిని చూరి వారికి ఆజ్ఞాపించిన దేమగా - ''మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని"

6

ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్ళుడి.

7

వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించియున్నదని ప్రకటించుడి.

8

"రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టరోగులను శుద్ధులుగా చేయుడి. దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందియున్నారు. ఉచితముగానీయుడి."

9

"మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి."

10

| పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?

11

"మరియు మీరు ఏ పట్టణములోనైనను, ఏ గ్రామములోనైనను మీరు ప్రవేశించునప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి, అక్కడనుండి వెళ్ళువరకు అతని ఇంటనే బసచేయుడి."

12

"ఆ ఇంటిలో ప్రవేశించుచు, ఇంటి వారికి శుభమని చెప్పుడి."

13

ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.

14

ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి.

15

విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమ్ఱొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వదగినదై వుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' .

16

''తోడేళ్ళమధ్యకు గొఱ్ఱెలను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులు నైయుండుడి.

17

మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి; వారు మిమ్మును మహాసభల కప్పగించి తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు.

18

"వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై, నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు."

19

"వారు మిమ్మును అప్పగించునప్పుడు ఏలాగు మాట్లా డెదము, ఏమి చెప్పుదుమని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ ఘడియలోనే మీ కనుగ్రహింపబడును."

20

మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు.

21

"సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు ; పిల్లలు తలిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు."

22

మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించినవాడు రక్షింపబడును.

23

వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్య కుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి యుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.''

24

''శిష్యుడు బోధకుని కంటె అధికుడు కాడు. దాసుడు యజమాని కంటె అధికుడు గాడు.

25

శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలె వుండిన చాలును. ఇంటి యజమానికి బయెల్జెబూలని వారు పేరు పెట్టియుండినయెడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా?

26

కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలు పరచబడకపోదు. రహస్యమైనదేదియు తెలియబడకపోదు.

27

చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి. చెవిలో మీకు చెప్పబడినది మీరు మేడలమీద ప్రకటించుడి.

28

మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడ నరకములో నశింప జేయగలవానికి మిక్కిలి భయపడుడి.

29

రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు.

30

మీ తల వెంట్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి.

31

గనుక మీరు భయపడకుడి. మీరు అనేకములైన పిచ్చుకల కంటె శ్రేష్టులు.

32

మనుష్యుల యెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోక మందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.

33

మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగ నందును.

34

నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.

35

"ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలకి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని."

36

ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు.

37

"తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించు వాడు నాకు పాత్రుడు కాడు; కుమారునినైనను, కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;"

38

తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.

39

తన ప్రాణము దక్కించుకొనువాడు దానిని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. ఫలము పొందుట (మార్కు9:41)

40

మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొను వాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును.

41

ప్రవక్తయని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును

42

మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను''

Link: