Matthew 22
యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను.
''పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది.
ఆ పెండ్లివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి.
"కాగా, అతడు మరికొంతమంది దాసులను పంపి, ఆహ్వానింపబడిన వారికి విందు సిద్ధముగా నున్నది, ఎద్దులునును క్రొవ్విన పశువులును వధింపబడియున్నవి, కావున విందుకు రండని చెప్పించెను. కాని"
వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరియొకడు తన వ్యాపార నిమిత్తము పోయిరి.
తక్కిన వారు ఆ దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి.
"కాబట్టి రాజు కోపపడి తన సైనికులను పంపి, ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగుల బెట్టించెను."
"అప్పుడతడు పెళ్ళి విందు సిద్ధముగా నున్నది, కాని పిలువబడిన వారు పాత్రులు కారు"
"గనుక రాజ మార్గములకు పోయి, మీకు కనబడిన వారందరిని పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను."
"ఆ దాసులు రాజ మార్గమునకు పోయి, చెడ్ఢవారినేమి, మంచివారి నేమి తమకు కనబడిన వారందరిని పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్ళి ఇల్లంతా నిండెను."
"రాజు, కూర్చున్నవారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చి"
"స్నేహితుడ, పెండ్లి దుస్తులు లేకుండ లోపలికి ఏలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియైయుండెను."
"అంతట రాజు వీనిని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలో పారవేయుడి. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను."
కాగా పిలువ బడినవారనేకులు కాని కొందరు మాత్రమే ఏర్పరచబడినవారు'' అని వారితో చెప్పెను.
ఆ తరువాత పరిసయ్యులు మాటలలో ఆయనను చిక్కుపరచెవలెనని ఆలోచించుచు
బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి దేవుని మార్గము సత్యముగా బోధించు చున్నావనియు, నీవెవరిని లక్ష్యపెట్టవనియు, మొహమాటము లేనివాడవనియు మేము యెరుగుదుము. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా?
"నీకేమి తోచుచున్నది, మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడ తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి."
"యేసు వారి దురద్దేశ్యమునెరిగి ''వేషధారులారా, నన్నెందుకు పరీక్షించు చున్నారు?"
"పన్ను కట్టే నాణెమొకటి నాకు చూపించుడి'' అని వారితో చెప్పగా, వారొక దేనారమును తెచ్చి చూపించిరి."
అప్పుడాయన - ''ఈ రూపమును పై వ్రాతయు ఎవరివి ?'' అని అడుగగా వారు కైసరువియనిరి.
"అందుకాయన - ''ఆలాగైతే కైసరువి కైసరునకు, దేవునివి దేవునికిని చెల్లించుడి'' అని వారితో చెప్పెను."
వారీ మాటలకు ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి.
పునరుత్థానము లేదని వాదించొ సద్దూకయ్యులు ఆ దినము ఆయన యొద్దకు వచ్చి -
"''బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునకు సంతానము కలుగజేయవలెనని మోషే చెప్పియున్నాడు."
మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను.
"రెండవ వాడును, మూడవ వాడును ఏడవవాని వరకును అందరును ఆలాగునే చేసి చనిపోయిరి."
వారందరి తరువాత ఆ స్త్రీ కూడ చనిపోయెను.
పునరుత్థానములో ఈ యేడుగురిలో ఆమె ఎవరికి భార్యగా నుండును ? ఆమె వీరందరికిని భార్యగా నుండెనుగదా?'' అని అడిగిరి.
"అందుకు యేసు - ''లేఖనములను గాని, దేవుని శక్తిని గాని ఎరుగక మీరీలాగు పొరబడి మాట్లాడుచున్నారు."
"పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లి కియ్యబడరు. వారు పరలోక మందున్న (దేవుని) దూతలవలె నుందురు."
"మృతుల పునరుత్థానమును గూర్చి'' - ''నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను'' (నిర్గమ3:6) అని"
దేవుడు చెప్పిన మాట మీరు చదువ లేదా ?
"ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు గాడు'' అని వారితో చెప్పగా, జనులది విని ఆయన బోధ కాశ్చర్యపడిరి."
ఆయన సద్దూకయ్యులు నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడి ఆయనయొద్దకు వచ్చిరి.
వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు -
"'బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను."
"అందుకాయన - ''నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే."
ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.
నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే.
ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నవి'' అని అతనితో చెప్పెను.
ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి -
"''క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడు?'' అని అడుగగా, వారు - ఆయన దావీదు కుమారుడు అని చెప్పిరి."
అందుకాయన ''ఆలాగైతే'' ''ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు -
"- నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా, చేయువరకు నాకుడి పార్శ్వమున కూర్చుండుము'' (కీర్తన110:1) ''అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు ?"
"దావీదు ఆయనను ప్రభువని చెప్పిన యెడల ఆయన ఏలాగు అతనికి కుమారుడగును? అని అడుగగా,"
ఎవడును మారు మాట చెప్పలేక పోయెను. ఆ దినమునుండి ఎవడును ఆయనను ప్రశ్నలడుగుట కెవడును తెగింపలేదు?