Matthew 23
అప్పుడు యేసు జన సమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను-
"''శాస్త్రులును, పరిసయ్యులును మోషే పీఠముమీద కూర్చుండు వారు"
గనుక వారు మీతో చెప్పువాటన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.
మోయ శక్యముగాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు.
మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నియు చేయుదురు. తన రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవి గాను చేయుదురు.
"విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను"
"సంత వీధులలో వందనములను, మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు."
"మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు."
మరియు భూమిమీద ఎవనికైనను తండ్రియని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందున్నాడు.
మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు.
మీలో అందరి కంటే గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును.
తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.
"అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల యెదుట పరలోక రాజ్యమును మూయుదురు."
"మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించువారిని ప్రవేశించ నీయరు."
"అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా మీరు మోసగాళ్ళు. ఒకని మీ మతములో కలుపుకొనుటకు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు, గానీ అతడు వచ్చి కలిసినప్పుడు అతనిని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేసెదరు."
"అయ్యో గ్రుడ్డి మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొంటే అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టుపెట్టుకొంటే వాడు దానికి బద్దుని మీరు చెప్పుదురు."
"అంధులారా, అవివేకులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా?"
మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకొంటే అందులో నేమియు లేదు గాని దానిపై అర్పణము తోడని ఒట్టుపెట్టుకొనిన యెడల దానికి బద్దుని చెప్పుదురు.
"అంధులారా, అవివేకులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధ పరచు బలిపీఠమా?"
"బలిపీఠముతోడని ఒట్టు పెట్టుకొనువాడు దాని తోడనియు, దానిపైనున్నవాటనిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు."
మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొనువాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు.
"మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనువాడు దేవుని సింహాసనము తోడనియు, దాని పైని కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు."
"అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్ర మొదలగు వాటిలో పదియవవంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి; మీరు వాటిని వదలకుండ చేయవలెను."
"గ్రుడ్డి మార్గదర్శకులారా, దోమను ఒడగట్టి ఒంటెను మ్రింగువారివలె మీరున్నారు."
"అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను, పళ్ళెమును, వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దురాశ స్వార్ధముతో నిండియున్నవి."
"గ్రుడ్డివారలారా, గిన్నెను పళ్ళెమును వెలుపల శుద్ధియగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము."
"వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల చాలా శృంగారముగా కనబడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి."
"ఆలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల అక్రమముతోను, వేషధారణతోను నిండియున్నారు."
"అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు"
మనము మన పితరుల దినములలో నుండిన యెడల ప్రవక్తల మరణ (రక్త) విషయములో వారితో పాలివారమై యుండకపోదుమని చెప్పుకొందురు.
అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులైయున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.
మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి.
"సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు?"
అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువవేసి చంపుదురు. కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతో కొట్టి పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు.
నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడను జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.
ఇవన్నియు ఈ తరమువారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను''
"''యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికేలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనను కొంటిని గాని మీరొల్లక పోతిరి."
ఇదిగో పాడుబడిన మీ యిల్లు మీకు విడువబడినది.
ఇది మొదలుకొని - ప్రభువు పేరటవచ్చువాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను''